Chamala Kiran kumar reddy: సీఎం రేవంత్ అరెస్టు బీజేపీ లక్ష్యం
ఢిల్లీ పోలీసుల అండదండలతో సీఎం రేవంత్ రెడ్డి ని అరెస్ట్ చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
భువనగిరి కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి
ప్రజా దీవెన, హైదరాబాద్: ఢిల్లీ పోలీసుల అండదండలతో సీఎం రేవంత్ రెడ్డి ని అరెస్ట్ చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala kiran kumar reddy, ) వ్యాఖ్యానించారు. గురువారం ఆయన సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియోను విడుదల చేశారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రు లను అరెస్ట్ చేసినట్లు రేవంత్ రెడ్డి ని కూడా అరెస్టు చేసి కాంగ్రెస్(congress) నాయకులు, కార్యకర్తలను భయ బ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
సీఎం రేవంత్ రెడ్డి గతంలో బీజేపీ(BJP), బీఆర్ ఎస్(BRS) ప్రభుత్వాల పైన పోరాటం చేసి ఎన్నోసార్లు జైలుకు వెళ్లారని, వాళ్లు ఎన్ని కుట్రలు చేసినా భయపడేదే లేదని స్పష్టంచేశారు. తెలంగాణలో బీజేపీ చేయించిన సర్వేలో ఆ పార్టీ కి ఒక్కసీటు కూడా రాదని తేలడం తో ఇలాంటి కుట్రలకు పాల్పడు తోందని ఆరోపించారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా, సీఎం గా మార్ఫింగ్ చేయాల్సిన అవసరం రేవంత్ రెడ్డి(Revanth reddy) కి ఏముందని ప్రశ్నించా రు. తెలంగాణ ప్రజలు మొన్ననే బీఆర్ఎస్ ను తరిమికొట్టారని, కేంద్రం లో బీజేపీకి అదే గతి పడుతుందని స్పష్టం చేశారు.
BJP target CM Revanth reddy arrest