Bhongir : చామల గెలుపు ఖాయం
పార్లమెం ట్ ఎన్నికల్లో భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డినీ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే గ్రామ గ్రామాన అభివృద్ధి బాధ్యత నేనే తీసుకుంటానని భువనగిరి ఎంపీ నియోజకవర్గ ఇన్చార్జ్ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు.
భారీ మెజార్టీతో గెలిపిస్తే అభివృ ద్ధి బాధ్యత నేనే తీసుకుంటా
మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
రాజగోపాల్ రెడ్డి రాకతో పులకరిం చిన రామన్నపేట
మండుటెండని సైతం లెక్కచేయ కుండా కదం తొక్కిన కాంగ్రెస్ క్యాడర్
ప్రజా దీవెన, రామన్నపేట: పార్లమెం ట్ ఎన్నికల్లో భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డినీ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే గ్రామ గ్రామాన అభివృద్ధి బాధ్యత నేనే తీసుకుంటానని భువనగిరి ఎంపీ నియోజకవర్గ ఇన్చార్జ్ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకునేందుకు ఇంత పెద్ద ఎత్తున మండుటెండలో వచ్చి న ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు అని పేర్కొన్నారు.
గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో 68,000 వేల పైచిలుకు మెజార్టీతో వేముల వీరేశం ను గెలిపించారని, దానికి మీకు ఏమిచ్చినా తక్కువేనని, ఎంపీ ఎన్నికల్లో సైతం భువనగిరిలో కాంగ్రెస్ జెండా మూడోసారి ఎగిరేo దుకు సహకరించాలని కోరారు. నకిరేకల్ లో ఒక గుంట నక్క పార్టీకి మోసంచేసి పోయిందని, గుంత నక్క పోతే ఒక పులిని తెచ్చుకు న్నామని, అన్నం పెట్టిన వారికి సున్నం పెట్టిన వ్యక్తిని ఇంటికి పంపిచ్చుకున్నామని గుర్తు చేశారు.
పది సంవత్సరాల్లో కెసిఆర్ ఆయన ఇంట్లో ఉద్యోగాలు ఇచ్చుకుండు తప్ప విద్యార్థులకు ఒక్క ఉద్యోగం సక్కగ ఇవ్వలేదని, అన్ని పేపర్ లీకులే జరిగే విద్యార్థుల జీవితాలు ఆగమాగం చేశారని ఆరోపించారు. నేను 2009లో ఎంపీగా ఉన్నప్పుడు పిలాయిపల్లి కాల్వను ఏపీ లింగో టం చెరువు వరకు నిర్మాణం చేశామని, రామన్నపేట మండ లంలో ప్రతి ఎకరానికి నీరు పారేలా ప్రణాళికతో వస్తామని స్పష్టం చేశా రు. నకిరేకల్ నియోజకవర్గంలో రామన్నపేట మండలం వార్ వన్ సైడ్ గా ఉండాలని, కాంగ్రెస్ కు భారీ మెజారిటీ రావాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో
భాగంగా గురువారం నకిరేకల్ నియోజకవర్గం రామన్నపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపుకై నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న మునుగోడు ఎమ్మెల్యే భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం, తెలంగాణ రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్ తదితరులతో కలిసి మాట్లాడారు. కవిత జైల్లో ఉంది ఆమె వచ్చే బతుకమ్మ అక్కడే ఆడుతుందని, కేసీఆర్ కుటుంబం చేసిన పాపాలు అటువంటివని వివరించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా నిర్మాణం చేసుకుం దామని పిలుపునిచ్చారు.
మీ అందరి సహకారంతో మీ అందరి కష్టంతో చామల కిరణ్ కుమార్ రెడ్డి భారీ మెజారిటీతో గెలువబోతుం డని ధీమా వ్యక్తం చేశారు. భువనగి రి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రామన్నపేట మీ ర్యాలీని చూస్తే నాకు గుండె ధైర్యం పెరిగిందని, నాకు టికెట్ డిక్లేర్ ఐన 20 రోజుల నుండి నా గెలుపు కోసం అహర్ని శలు కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములని తెలియజేశారు. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాడిని రామన్నపేట అంటేనే బ్రాండ్ మళ్ళీ రామన్నపేట ను నియోజవర్గ కేంద్రంగా చేసుకుం దామని స్పష్టం చేశారు. గతంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ విషయంలో కూడా చిత్తశుద్ధి లేదని విమర్శించారు.
రామన్నపేట రైల్వే స్టేషన్ లో అన్ని రైళ్లు ఆగేవిధంగా చూస్తామని హామీ ఇచ్చారు. రామ న్నపేట భువనగిరి రోడ్లను విస్తరణ చేసుకుందామని, వంద పడకల ఆసుపత్రి నిర్మాణం చేసుకుందామ ని, అవినీతి పరుడైన కేసీఆర్ ని గత పది సంవత్సరాలో బిజెపి ఏమి చేయలేక పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆయన అవినీతి చిట్టాని బయటపెడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రామన్నపేట మండ ల యం.పి.పి పూస బాలమణి, జెడ్పీటీసీ పున్న లక్ష్మి-జగన్ మెహన్, మండల పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి మల్లారెడ్డి, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నా రు.
Chamala kiran kumar reddy win in bhongir