International Labour Day:ఘనంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే
జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, యదాద్రి భువనగిరి ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణములో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు సూచనల మేరకు, సంస్థ కార్యదర్శి, ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి వి. మాధవిలత
ప్రజా దీవెన, భువనగిరి: జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, యదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri)ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణములో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు సూచనల మేరకు, సంస్థ కార్యదర్శి, ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి వి. మాధవిలత బుధవారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డె (Mayday)సందర్బంగా కోర్టు ప్రాంగణములో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు.
ఈ సందర్బంగా సమావేశములో పాల్గొన్న పారిశుధ్య కార్మికులు మరియు ఇతర కార్మికులకు న్యాయమూర్తి కార్మిక సంక్షేమ చట్టాలు, కార్మికులకు(workers)గల చట్టపరమైన సంక్షేమ పథకాలు, న్యాయ సహాయం అర్హతలు అంశాలపై అవగాహన కల్పించారు. భువనగిరి(Bhuvanagiri) న్యాయవాదుల సంఘం అధ్యక్షులు బి. హరినాథ్ మాట్లాడుతూ కార్మిక శక్తి దేశ భవితకు పునాది అని, కార్మికులకు ఉచిత న్యాయ సేవలు అందించటానికి తమ న్యాయవాదులు ప్యానల్ న్యాయవాదుల వ్యవస్థ ద్వారా న్యాయ సేవలు అందిస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వ న్యాయవాది నాగారం అంజయ్య మాట్లాడుతూ కార్మిక సంక్షేమం ముఖ్యమని, వారికిగల చట్ట పరమైన హక్కుల సాధికారతలో ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా వ్యవహారించాలని ముఖ్యంగా అసంఘటిత రంగంలోని కార్మికుల సంక్షేమానికి పాటుపడాలని తెలిపారు. డిప్యూటీ న్యాయ సహాయ న్యాయవాది జి. శంకర్ న్యాయ సహాయం పొందటములో కార్మికులకు ఉన్న అర్హతలు, తమ న్యాయ సహాయ కార్యాలయం అందించే సేవల గురించి తెలిపారు. కార్యాక్రమములో చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఎస్. జైపాల్, సహాయ ప్రభుత్వ న్యాయవాది బి. కేశవ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు, కార్మికులు పాల్గొన్నారు.
International Labor Day May Day celebrations