Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

KCR Road Show: బిజెపి పాలనలో దేశం పరువు పటాపంచలు

దేవుడు నన్ను తెలంగాణ కోసమే పుట్టిం చాడని, కంఠం లో ప్రాణం ఉన్నం తవరకు రాష్ట్ర అభివృద్ధి, ప్రజల హక్కుల కోసం ఉద్యమిస్తానని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ స్పష్టం చేశారు.

మోదీ పరిపాలనంతా డొల్లతనం తో కునారిల్లింది
నా బిడ్డను జైల్లో పెట్టినా బిజెపి కి నేను భయపడలేదు
తెలంగాణ శత్రువైన కాంగ్రెస్‌ దేవు ళ్లపై ప్రమాణాలతో టైం పాస్
తెలంగాణ ప్రజల గుండెల్లో నేను, నా గుండెల్లో రాష్ట్ర ప్రజలు ఉన్నా రు
మంచిగున్న రాష్ట్రం ఆగమైతుంటే చూస్తూ ఊరుకోవాలా
భువనగిరి బస్సు యాత్రలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్‌
ప్రజా దీవెన, భువనగిరి: దేవుడు నన్ను తెలంగాణ కోసమే పుట్టిం చాడని, కంఠం లో ప్రాణం ఉన్నం తవరకు రాష్ట్ర అభివృద్ధి, ప్రజల హక్కుల కోసం ఉద్యమిస్తానని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్‌(KCR) స్పష్టం చేశారు.భువనగిరి బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్‌కు మద్దతు గా గురువారం కేసీఆర్‌ బస్సు యాత్రలో భాగంగా ప్రచారం రాత్రి భువనగిరిలో రోడ్‌ షో(Road show)లో ప్రసం గించారు.

కేంద్రంలో బీజేపీ పదేళ్ల పాలనంతా డొల్లతన మని బిఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌ ద్వజమెత్తా రు. తెలంగాణకు తీవ్ర అన్యా యం చేశారని, బిజెపి హయాంలో దేశం పరువు పోయిందని, సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ అన్నారని, మరి అభివృద్ధి ఏది అని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రశ్నించారు. రాష్ట్రానికి ఏమీ చేయని ఆ పార్టీకి ఓట్లడిగే అర్హత లేదన్నారు. కేంద్ర మంత్రి ఉండి కూడా రూపాయి తేలేకపోయారని ఆరోపించారు. బీజేపీ (BJP)అంటే అక్షింతలు, పులిహోర, తీర్థాలు, కాషా య జెండాలు అని విమర్శిం చారు.

యాదాద్రి ఆల యాన్ని తాము అద్భుతంగా అభి వృద్ధి చేశామని, ఎన్నడైనా దాన్ని ఓట్ల కోసం వాడుకున్నామా అని వ్యాఖ్యానించారు. తన బిడ్డను జైల్లో పెట్టినా బీజేపీకి భయపడ లేదని, బీజేపీ దేవుడి పేరుతో ఓట్లు దండుకుంటోందని తీవ్ర స్ధాయిలో ద్వజమెత్తారు. కాంగ్రెస్‌(Congress) దేవుడి మీద ఒట్టు వేసి కాలం గడుపుతోందని విమర్శించారు. సీఎం యాదాద్రి మీద ఓట్టేసి చెబుతున్నారు కానీ చేయడం లేదన్నారు. అందరి తరపున కొట్లాడే ఏకైక వ్యక్తి కేసీఆర్‌ అని పెద్ద మనిషిలా అన్నింటిపై యుద్ధం చేస్తానని చెప్పారు.

బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్‌ ఆరోపిస్తోందని భువనగిరి మున్సిపాలిటీలో ఆ పార్టీ చేసిందే మిటని నిలదీశారు. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌, అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టేనని, బీ ఆర్‌ఎస్‌ లౌకిక పార్టీ అని పేర్కొ న్నారు. రాష్ట్రాన్ని అడుగడుగునా బీజేపీ ఇబ్బంది పెట్టిందని దానికి ఓటేస్తే మోటర్లకు మీటర్లు పెడతా రని కేసీఆర్‌ హెచ్చరించారు. కులం, మతం చూడకుండా పాలించి తెలం గాణను(Telangana) ఒడ్డుకు తెచ్చామని, అందరూ సంతోషంగా ఉండేలా పనిచేశామని, ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేశామని వివరించారు.

మంచిగున్న తెలంగా ణ ఆగమైతుంటే చూస్తూ ఊర్కో వాలా అని ప్రశ్నించారు. ప్రజలకు, కాంగ్రెస్‌ పార్టీకి పంచాయితీ పడ్డది. కేసీఆర్‌ను కిందపడేసి కొట్లాడ మం టే ఎట్లా, కొట్లాడ్డానికి బలం కావా లంటే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ ఎస్‌ను గెలిపించాలి అని కేసీఆర్‌ కోరారు. దేవుడు కేసీఆర్‌ను తెలం గాణ కోసమే పుట్టించాడని తెలం గాణ ప్రజల గుండెను చీల్చితే కేసీ ఆర్‌ కనిపిస్తాడని, కేసీఆర్‌ గుండెను చీలిస్తే కనిపించేది తెలంగాణ ప్రజల ని పేర్కొన్నారు.

KCR not fear BJP and Modi