Kasoju Shankaramma: శంకరమ్మ కు కాంగ్రెస్ తీర్థం
మలి దశ తెలంగాణ అమరుడు శ్రీకాంతా చారి తల్లి, బిఆర్ఎస్ నాయకు రాలు శంకరమ్మ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం ఆమె కు కాంగ్రెస్ కండువా కప్పి ఎఐసిసి ఇంచార్జ్ దీపాదాస్ మున్సీ పార్టీలోకి ఆహ్వానించారు. దీపా దాస్ మున్సీ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో శంకరమ్మ కాంగ్రెస్ పార్టీ లో చేరారు.
ఎఐసిసి ఇంచార్జ్ దీపాదాస్ మున్సీ ,మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక
ప్రజా దీవెన, హైదరాబాద్: మలి దశ తెలంగాణ అమరుడు శ్రీకాంతా చారి తల్లి, బిఆర్ఎస్ నాయకు రాలు శంకరమ్మ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం ఆమె కు కాంగ్రెస్ కండువా కప్పి ఎఐసిసి ఇంచార్జ్ దీపాదాస్ మున్సీ పార్టీలోకి ఆహ్వానించారు. దీపా దాస్ మున్సీ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో శంకరమ్మ కాంగ్రెస్ పార్టీ లో చేరారు.
ఈ సంధర్బంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మట్లాడుతూ తెలంగాణ ఉద్య మ అమరుడు శ్రీకాంత చారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరారని ప్రకటించారు. శంకరమ్మకు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తామని, శంకర మ్మ కుటుంబం రాష్ట్రానికి చేసిన త్యాగం కాంగ్రెస్ పార్టీ మరవదని మంత్రి తెలిపారు. నల్లగొండ జిల్లాకు చెందిన వందలాది మంది బీఆర్ ఎస్ ముఖ్య నేతలు పార్టీకి రాజీనా మా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరార న్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఉత్సాహంగా ఉన్న నేతలను పార్టీ లో చేర్చుకోవాలని ఏఐసీసీ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని తెలిపారు.
హుజుర్‌న గర్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు జరిగాయన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అబద్ధా లు ప్రచారం చేసుకుని గెలవాలని ప్రయత్నం చేస్తున్నాయని మండి పడ్డారు. మోదీ దిగజారి మాట్లాడు తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రా నికి ప్రధాని మోదీ చేసిన అభివృద్ధి శూన్యమని వ్యాఖ్యలు చేశారు. అదాని కాంగ్రెస్ మనిషి అన్నట్లు మోదీ మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఇండియా కూటమి కేంద్రంలో, అధికారంలోకి వస్తుం దన్న సమాచారంతోనే మోదీ భయంతో మాట్లాడుతున్నారన్నా రు. కేసీఆర్ 10 ఏళ్ళు సీఎంగా ఉండి రాష్ట్రాన్ని నాశనం చేశారని విరుచుకుపడ్డారు. తడిసిన ధాన్యా న్ని ఎమ్మెస్పీ ధరకు ప్రభుత్వమే కొంటుందని స్పష్టం చేశారు. ఎన్ని కలు పూర్తవగానే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
Shankaramma join congress party