KCR: బిజెపి శ్రీమంతుల పక్షం.. బిఆర్ఎస్ పేదలతోనే…
బీజేపీకి పేదలంటే పట్టదని, వారి ఎజెం డాలో పేదలు, కార్మికులు, రైతులు, ఆటోకార్మికులు వంటి వారు ఉండ రన,అంబానీ, అదానీలకు, శ్రీమం తులకు రూ. లక్షల కోట్ల కార్పొరేట్ ట్యాక్స్ రద్దు చేస్తారు తప్ప పేదవా రికి ఏమీ చేయరని, పదేండ్లుగా అది నిరూపితమవుతూనే ఉoదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నా రు.
పక్కా పేదల విరోధులు బీజేపీ వాళ్లు
రైతులు, కూలీలు వారికి పట్టరు –కార్పొరేట్లకు లక్ష కోట్ల పన్ను మాఫీ
సిరిసిల్ల, సిద్దిపేట రోడ్ షోల్లో బీఆ ర్ఎస్ అధినేత కేసీఆర్
ప్రజా దీవెన, హైదరాబాద్: బీజేపీకి(BJP) పేదలంటే పట్టదని, వారి ఎజెం డాలో పేదలు, కార్మికులు, రైతులు, ఆటోకార్మికులు వంటి వారు ఉండ రన,అంబానీ, అదానీలకు, శ్రీమం తులకు రూ. లక్షల కోట్ల కార్పొరేట్ ట్యాక్స్ రద్దు చేస్తారు తప్ప పేదవా రికి ఏమీ చేయరని, పదేండ్లుగా అది నిరూపితమవుతూనే ఉoదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నా రు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం, సిద్దిపేట పాతబస్టాండ్ చౌరస్తాలో నిర్వహించిన బస్సు యాత్రకు తరలివచ్చిన అశేష జన వాహినిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆయన ప్రసంగం యావత్తు ఆయన మాటల్లోనే.. ‘రాజన్నసిరిసిల్ల జిల్లా.. దేవుని పేరుమీద ఉండాలని, వేములవాడ రాజన్న పేరు పెట్టి.. రాజన్నసిరిసిల్ల జిల్లాగా పెట్టుకున్నం. ఇక్కడికి నిన్ననే ప్రధాని మోదీ వచ్చిండు. ఆయన పక్కనే బండి సంజ య్(Bandi Sanjay kumar) ఉన్నడు.
పొద్దున లేస్తే దేశం కోసం ధర్మం కోసం మాట్లాడే మోదీ.. హిందూహిందూ అని కొట్టుకునే బండి సంజయ్.. వేములవాడకు ఒక్క రూపాయి ఇస్తమని చెప్పిండ్రా? ఈ దేవస్థానాన్ని బాగుచేస్తమని చెప్పిండ్రా? నాడు దేవాలయ ప్రాంతం ఇరుకుగా ఉంటే.. నేనే 35 ఎకరాల స్థలాన్ని చెరువులోంచి ఇప్పించి, అభివృద్ధి చేయించిన. అయినా ఏనాడూ దేవుడి పేరు చెప్పి ఓట్లు అడగలేదు. ఇప్పుడు దేవుని పేరు చెప్పి ఓట్లు అడిగేటోళ్లు దేవునికి ఒక్క రూపాయికి కూడా ఇవ్వలేదు.
ఆనాడు చేనేత బిడ్డలు ఆత్మహ త్యలు చేసుకుంటుంటే పార్టీ నుంచి రూ.50 లక్షలు తెచ్చి ఒక ట్రస్టు ఏర్పాటు చేసిన. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత కేటీఆర్(KTR) ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా అనేక పథకాలు తెచ్చుకున్నం. రంగులు, రసా యనాలు తెచ్చుకున్నం. సిరిసిల్లకు ఒక టెక్స్టైల్ పార్క్ కావాలంటే మోదీ ఇవ్వలేదు. అయినా రాష్ట్రం చేతిలో ఉన్నంతలో బతుకమ్మ చీరెలు, స్కూల్ యూనిఫాంలు ఇచ్చి కాపాడుకున్నం. మరమగ్గాల కార్మికులను ఆదుకున్నం. కనీసం నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు జీతం వచ్చేలా పనులు చేసుకున్నం. కాంగ్రెస్(Congress) సర్కారు అన్నీ బండ్ పెట్టింది.
పాత బకాయి లు ఇవ్వటం లేదు. కొత్త ఆర్డర్లూ ఇస్తలేదు. పేదలకు బట్టలు, చేనేతలకు పని దొరుకుతుందని మేము ప్రారంభిస్తే.. ఈ ప్రభుత్వం ఎందుకు బంద్ పెట్టింది. పదేం డ్ల కిందట విదేశాల్లోని నల్లధనం తీసుకోస్తానని మోసపూరిత హామీ ఇచ్చిండు మోదీ. ప్రతి ఒక్కరి అకౌంట్లో రూ.15 లక్షలు వేస్తామన్నడు. ‘సిరిసిల్లలో ఎవరికైనా వేసిందా? బండి సంజయ్ మీకు తెచ్చి ఇచ్చిందట కదా?.. అని కేసీఆర్ అడగ్గానే లేదు అంటూ ప్రజలు ఖాళీ చేతులు ఊపుతూ సమాధానం ఇచ్చారు’ సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏమైంది? అమృత్కాల్ వచ్చిందా? అచ్చేదిన్ వచ్చిందా? బేటీ పడావో బేటీ బచావో ఏమైనా వచ్చిందా? జనధన్ ఖాతా ఏమైంది? అంటే ఏమీ రాలేదు. అంతా గ్యాస్.. ట్రాష్. ఏ పేదకూ ఏం జరగలె. గొల్లకుర్మకు గొర్లు ఇస్తామంటే దాన్ని అడ్డుకున్నరు. మళ్లీ బీజేపీ గెలిస్తే పెట్రోల్ ధరలు రూ.400 అవుతయ్. ఆలోచన చేయకపోతే మోసపోయి గోసపడతం.
తెలంగాణలో మోసపూరిత హామీలు ఇచ్చి, అరచేతిలో వైకుంఠం చూపెట్టి గద్దెకెక్కిన కాంగ్రెస్ ఉచిత బస్సు హామీ తప్ప ఏదీ నెరవేర్చలేదు. మహిళలకు రూ.2,500 ఇవ్వలేదు. రూ.2 లక్షల రుణమాఫీ చేయలేదు. ఉచిత బస్సుల్లో ఒకవైపు ఆడవాళ్లు సర్కస్ చేసినట్టు తన్నుకుంటున్నరు. మరోవైపు ఆటోరిక్షా కార్మికులు రోడ్డునపడి అన్నమో రామచంద్రా అని ఏడుస్తున్నరు.
రైతులకు రైతుబంధు వచ్చిందా? అవి ఇక రావు. రైతుబంధు రాలె, కరెంటు రాలె, నీళ్లు రాలె, మరమగ్గాలు మూతబడే పరిస్థితి, చేనేతలు చనిపోయే పరిస్థితులు వచ్చాయి. సిరిసిల్లలో ఉన్న రచయిత పెద్దింటి అశోక్ వంటి రచయితలు.. విద్యార్థులు, యువకులు, చదువుకున్నవారు, మేధావులు ప్రజలను చైతన్యం చేసి, చర్చపెట్టి ఓటు వేయించాయి. అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ మళ్లీ ఓట్లు అడుగుతున్నది. కల్లాల్లో ధాన్యం తడిపోతున్నది. వడ్లు తడిసిపోతే అడిగే దిక్కులేదు. కొనే దిక్కులేదు. పెన్షనారులకు(Pensions) రూ. 4 వేల పెన్షన్ రాదు. వచ్చే అవకాశమే లేదు. ఏ హామీ అమలు పై నమ్మకం లేదు.
BJP develop rich and BRS develop poor