Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

బిజెపిని నిలువరించేది బిఆర్ఎస్ మాత్రమే

దేశంలో బిజెపి ప్రభుత్వం అడ్డగోలు వ్యవ హారాన్ని అడ్డుకునేది బి ఆర్ ఎస్ ఒక్కటేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ( కేటీఆర్) అన్నారు.పార్లమెంటులో బీఆర్‌ఎస్‌ ఎంపీలు లేకపోతే ఎన్నికల తర్వాత హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే ప్రశ్నించేవాళ్లు ఉండబోరని హెచ్చరించారు.

బిజెపి గెలిస్తే కేంద్రపాలిత ప్రాంతo చేసే అవకాశం
బిఆర్ఎస్ ఎంపిలు అయితేనే ప్రశ్నించి అడ్డుకుంటారు
వేములవాడ ప్రచారంలో బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ప్రజాదీవెన, వేములవాడ: దేశంలో బిజెపి ప్రభుత్వం అడ్డగోలు వ్యవ హారాన్ని అడ్డుకునేది బి ఆర్ ఎస్ ఒక్కటేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ( కేటీఆర్) అన్నారు.పార్లమెంటులో బీఆర్‌ఎస్‌(BRS) ఎంపీలు లేకపోతే ఎన్నికల తర్వాత హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే ప్రశ్నించేవాళ్లు ఉండబోరని హెచ్చరించారు. పార్ల మెంటులో ప్రశ్నించే ఎంపీలు లేకపో తే హైదరాబాద్‌ని బీజేపీ కేంద్ర పాలి త ప్రాంతం చేసే అవకాశం ఉంద న్నారు.

కరీంనగర్ లోక్‌సభ నియో జకవర్గ పరిధిలోని వేములవాడలో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచా రంలో బీఆర్‌ ఎస్‌ నేత కేటీఆర్‌(KTR) ఆసక్తికర వ్యాఖ్య లు చేశారు. జూన్ 2 తేదీతో హైద రాబాద్‌ను ఏపీ, తెలంగాణకు ఉమ్మ డి రాజధానిగా ప్రకటించి 10 ఏళ్లు పూర్తవుతుంద న్నారు. జూన్ 2 తర్వాత హైదరా బాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించే అవకాశం ఉందని ఆ మేరకు తమకు సమాచారం ఉందని వ్యాఖ్యానించారు.

బీజేపీ ఇలాంటి ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకోవడం కాంగ్రెస్‌తో(Congress) సాధ్యం కాదని, బీఆర్ఎస్ మాత్రమే ఇలాం టి ప్రయత్నాలను అడ్డుకోగలద న్నారు. దీని కోసం పార్లమెంటులో బీఆర్ఎస్‌కు సంఖ్యాబలం అవసర మని పేర్కొన్నారు.ఇక పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ 12 సీట్లు గెలిస్తే ఏడాదిలోగా కేసీఆర్‌(KCR) మళ్లీ రాష్ట్ర రాజకీయాలను శాసించే రోజు వస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ మెరుగైన ఫలితాలు సాధిస్తే రాష్ట్రంలో పెను రాజకీయ మార్పులు చోటుచేసు కుంటాయంటూ కేటీఆర్ సంకేతా లిచ్చారు. ఇక రాముడు అందరి వాడని బీజేపీకి మాత్రమే సొంతం కాదన్నారు. మనం కూడా జై భారత్‌, జై శ్రీరామ్‌ అందామంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ను(Hyderabad) కేంద్ర పాలిత ప్రాం తం చేసే అవకాశముందంటూ కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలం గాణ దంగల్‌లో కాక రేపుతున్నా యి.

హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చను న్నారంటూ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు పూర్తి అవాస్తామని కొట్టిపారేశారు కేంద్ర మంత్రి, సికింద్రాబాద్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి. సోమవారం లాలాగూడ, ఇందిరానగర్‌లో గెలిపే లక్ష్యంగా గల్లీ గల్లీ తిరుగుతూ ప్రచా రం చేస్తున్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కలిసి బీజేపీపై బురద చల్లే ప్రయ త్నం చేస్తున్నారని మండిపడ్డారు.

BRS political fight with BJP