Land Survey: వరంగల్ విమానాశ్రయంకోసం కసరత్తు
వరంగల్ ప్రాంతీయ విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి ఎట్టకేలకు ముందడుగు పడింది. ప్రాథమిక భూ సర్వే కోసం ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) కసరత్తు ప్రారంభించింది.
రాష్ట్రంలో ఆరు చోట్ల నిర్మాణానికి ప్రతిపాధనలు
400 ఎకరాల భూమి కావాలి: ఏఏఐ
ప్రజాదీవెన, వరంగల్: వరంగల్ ప్రాంతీయ విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి ఎట్టకేలకు ముందడుగు పడింది. ప్రాథమిక భూ సర్వే కోసం(Airport Authority of India) ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) కసరత్తు ప్రారంభించింది. కొన్నాళ్లుగా విమానాశ్రయ ఏర్పాటుపై కదలిక లేకపోవడంతో.. నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో ఏఏఐ కసరత్తు ప్రారంభిస్తుండడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం అదనపు భూమి కేటాయించడంతో ఇటీవల క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు సంబంధించిన హెలికాఫ్టర్లు కూడా క్షేత్రస్థాయిలోని పరిస్థితులను పరిశీలించాయి.
ఆరు చోట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు
రాష్ట్రంలో ఆరు చోట్ల ప్రాంతీయ విమానాశ్రయాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రాన్ని కూడా కోరింది. (Warangal Airport)మామునూరు(వరంగల్), ఆదిలాబాద్, బసంత్ నగర్(పెద్దపల్లి), జక్రాన్‌పల్లి(నిజామాబాద్), కొత్తగూడెం, గుడిబండ(మహబూబ్‌నగర్) లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు 2019లో ఏఏఐ ప్రాథమిక అధ్యయనం నిర్వహించి 6 చోట్ల నిర్మాణాలకు సుముఖత వ్యక్తం చేసింది. అనంతరం ఇది కాగితాలకే పరిమితమైంది. వరంగల్ విమానాశ్రయాన్ని తొలుత చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి.. ఈ మేరకు కేంద్రానికి తెలియజేసింది.
Land Survey for Warangal Airport