No confidence motion: ఓరుగల్లు మేయర్ గుండు సుధారాణి పై అవిశ్వాసo
తెలంగాణ లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిందో లేదో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌పై కన్నేసింది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఒకరి తర్వాత ఒకరు హస్తం గూటికి క్యూ కడుతున్న నేపథ్యంలో ఏకంగా ఓరుగల్లు మేయర్ కూడా అదే రూట్‌లో ఉన్నారన్న ప్రచారం కారణంగా టిఆర్ఎస్ పార్టీ అప్రమత్తమైంది.
ప్రజా దీవెన, వరంగల్: తెలంగాణ లో సార్వత్రిక ఎన్నికల (Parliament election polling)పోలింగ్ ముగిసిందో లేదో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌పై కన్నేసింది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఒకరి తర్వాత ఒకరు హస్తం గూటికి క్యూ కడుతున్న నేపథ్యంలో ఏకంగా ఓరుగల్లు మేయర్(warangal mayor) కూడా అదే రూట్‌లో ఉన్నారన్న ప్రచారం కారణంగా టిఆర్ఎస్ పార్టీ అప్రమత్తమైంది. పార్లమెంట్ ఎన్నికలు ముగిసినా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొ రేషన్‌లో అవిశ్వాసం తీర్మానంపై(no confidence motion) హాట్ హాట్ చర్చ జరుగుతోంది.
మేయర్ కుర్చీలో కూర్చో బెట్టిన వారే ఇప్పుడు కుర్చీ దింపడానికి కసరత్తు చేస్తున్నారని జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. ఓరుగల్లు మేయర్ పై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ కసరత్తు చేస్తోందని సమాచారం.ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ముఖ్యనేతలు, కా ర్పొరేటర్లు మేయర్ గుండు సుధారా ణి(Mayor Gundu Sudharani) పై అవిశ్వాసం ప్రవేశపెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారని తెలిసిం ది. నాలుగు రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలు, కార్పొరేటర్లు భేటీ అయి మేయర్‌పై అవిశ్వాసం ప్రవేశపెట్టే విషయంపై చర్చ జరి పారు. వారికి కలిసివచ్చే పార్టీలు, ఇతర పార్టీల కార్పొరేటర్ల మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నా రట ఓరుగల్లు మేయర్ పై హటాత్తుగా ఎందుకు అవిశ్వాసం ప్రవేశపె ట్టా లని కసరత్తు చేస్తున్నారు.
ఆమెను మేయర్ పీఠంపై కూర్చో బెట్టిన బీఆర్ ఎస్ పార్టే(BRS Party) ఇప్పుడు ఆమెను గద్దే దింపేందుకు ఎందుకు కసరత్తు ప్రారంభించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. బీఆర్ఎస్ పార్టే మేయర్‌పై అవిశ్వాసం ప్రవేశపె ట్టేందుకు తీవ్ర స్థాయిలో కసరత్తు ప్రారంభించింది. ఆ పార్టీ నుండి గెలుపొంది,గ్రేటర్ వరంగల్ మేయర్ పీఠం కైవసం చేసుకున్న గుండు సుధారాణి ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో మేయర్ పై ఆగ్రహం తో ఊగిపో తున్న బీఆర్ఎస్ పార్టీ నేతలు అవి శ్వాసం ప్రవేశ పెట్టేందుకు సిద్ధమై నట్లు చర్చ జరుగుతుంది.
no confidence motion on Mayor Gundu Sudharani