Kaleswaram project: కాళేశ్వరంను సందర్శించిన నిపుణుల బృందం
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఈఎన్సీ జనరల్ అనిల్‌కుమార్ నేతృత్వంలోని నిపుణుల బృందం శనివారం సందర్శించింది.
మేడిగడ్డ బ్యారేజీ వద్ద అధికా రులతో నిపుణుల బృందం
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నిశిత పరిశీలన
ప్రజా దీవెన, వరంగల్: కాళేశ్వరం ప్రాజెక్టులో(Kaleswaram project) భాగమైన మేడిగడ్డ(medigadda), అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఈఎన్సీ జనరల్ అనిల్‌కుమార్ నేతృత్వంలోని నిపుణుల బృందం శనివారం సందర్శించింది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని జ్యుడీషియల్ కమిషన్‌కు సాంకేతిక అంశాల్లో సాయమందించేందుకు ఈ కమిటీని నియమించిన విష యం విదితమే. ఈ కమిటీ తొలుత మేడిగడ్డ బ్యారేజీపైన(medigadda barrage) బ్రిడ్జి కుంగి పోయిన ప్రాంతంతో పాటు బ్యారేజీ అప్, డౌన్ స్ట్రీమ్‌లలో దెబ్బతిన్న ప్రాంతాలు, మరమ్మతులను క్షుణ్ణం గా పరిశీలించింది.
బ్లాక్–7లో కుంగి పోయి బాగా దెబ్బతిన్న పియర్స్ ను, తెరుచుకోకుండా బిగుసుకుపో యిన గేట్లను, బ్యారేజీ ఆప్రాన్‌ను, పియర్స్ కింది నుంచి నీరు లీకేజీ అవుతున్న తీరును పరిశీలించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) సూచనల మేరకు చేపడుతున్న మరమ్మతులను గమనించింది. బ్లాక్–7లో యం త్రాల సాయంతో తెరవడానికి ప్రయత్నించగా బిగుసుకుపోయిన గేట్ల కటింగ్(Cutting of gates), షీట్ ఫైల్స్ అమరిక(arrangement of sheet files), సీసీ బ్లాక్స్ పునరుద్ధరణ(renovation of CC blocks), డ్రిల్లింగ్(drilling), గ్రౌటింగ్(grouting works) పనులను నిశితంగా పరిశీ లించింది. అనంతరం బ్యారేజీ నిర్మా ణ సంస్థ ప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి పలు విషయాలపై ఆరాతీశారు. అనం తరం అన్నారం బ్యారేజీని సంద ర్శించి అక్కడి సీపేజీలు, బుంగలతో దెబ్బతిన్న 28, 35, 38, 44 నంబర్ల పియర్స్‌ను సభ్యులు పరిశీలిం చారు.
బ్యారేజీ ప్రాంతమంతా కలియతిరిగి పలు అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. సీసీ బ్లాక్‌ల పునరుద్ధరణ, గ్రౌటింగ్ కోసం చేపడుతున్న పనులను పరిశీ లించారు. అక్కడి నుంచి సాయం త్రానికి సుందిళ్ల బ్యారేజీని చేరుకొని పరిశీలన జరిపారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బ్యారేజీ డౌన్ సీమ్ ప్రాంతంలో జరుగుతున్న పనులను వారు పరిశీలించారు. జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ త్వరలో బ్యారేజీల సందర్శనకు రానున్న నేపథ్యంలో నిపుణుల కమిటీ జియో టెక్నికల్, జియాలజికల్ డేటాపై దృష్టి సారించి క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్లు సమాచారం.
team of experts visited Kaleswaram project