August 15th loan waiver:పంద్రాగస్టు లోపు రుణమాఫీ పరిహాసమే
తెలంగాణ రాష్ట్రoలో గడిచిన ఆరు నెలలుగా డబుల్ ఆర్ పధకం మాత్రమే మూ డు పూలు, ఆరు కాయలుగా విజ యవంతంగా అమలవుతుందని మాజీ మంత్రి, బిజెపి నాయకులు ఆరోపించారు.
ఆర్ఆర్ టాక్స్ పేరుతో అమలవు తున్న పథకం దేదీప్యమానం
రూ. 4 వేల కోట్ల డబ్బును రాహూ ల్ గాంధీకి పంపిస్తున్నారు
మాజీ మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర ఆరోపణలు
ప్రజా దీవెన, పరకాల: తెలంగాణ(Telangana) రాష్ట్రoలో గడిచిన ఆరు నెలలుగా డబుల్ ఆర్ పధకం మాత్రమే మూ డు పూలు, ఆరు కాయలుగా విజ యవంతంగా అమలవుతుందని మాజీ మంత్రి, బిజెపి నాయకులు ఆరోపించారు. తెలంగాణలో రూ. 4 వేల కోట్లు అక్ర మంగా వసూలు చేసి రాహుల్ గాంధీకి(Rahul Gandhi) పంపిస్తున్నా రని ఆయన ఆరోపించారు. ప్రభు త్వానికీ మతిపోగొట్టే రుణమాఫీ హామీ అమలు పరిహాసంగా నిలు స్తుందని స్పష్టం చేశారు. పరకాలలో నిర్వహించిన పట్టభద్రు ల ఎమ్మెల్సీ(MLC) ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొ ని మాట్లాడారు.ప్రతీ ఒక్కరూ బీజేపీ తరపున ప్రేమేందర్ రెడ్డికే ఓట్లు వేస్తామంటున్నారు.
గత ప్రభుత్వం కానీ, ప్రస్తుత ప్రభుత్వం కానీ ఏళ్లు గా టీచర్లకు జీతాలు చెల్లించడం లేదు. గతంలో కేసీఆర్ అన్యాయం చేసినందుకు ఇంటికి పంపించారు. బీఆర్ఎస్(BRS) పార్టీ పదేళ్లుగా డీఏలు చెల్లించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా తమ హామీలు నిల బెట్టుకోలేదు. ఈటల రాజేందర్(Etala Rajender)అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా హామీలు నిలబెట్టుకోలేనం దుకు బుద్ది చెప్పాలి. నిజాలు తెలు సుకుని ఓటును సద్వినియోగం చేసుకోవల్సిందిగా కోరుతున్నానని వ్యాఖ్యానించారు. ఎత్తిన జెండా దించకుండా, నమ్మిన సిద్దాంతం కోసం ప్రజల కోసం పార్టీ కోసం జీవించిన వ్యక్తి ప్రేమేందర్ రెడ్డి అని ఈటల రాజేందర్ అన్నారు.
నల్గొం డలో(Nalgonda) ఒక వ్యక్తి నడమంత్రపు సిరితో బీజేపీ ఎక్కడుందని అడిగాడు. 4 వ తేదీన తెలుస్తుందని చెప్పి వచ్చా, చాపకింద నీరులా తెలంగా ణలో బీజేపీ(BJP) పార్టీ బలం పుంజుకుం టోంది. చీమలు పుట్టలు పెడితే పాములు దూరినట్లు, మనమం దరం కొట్లాడితే తెలంగాణ వస్తె దీనిలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడని, ప్రశ్నించే గొంతు అంటూ మాట్లాడుతూ ఉంటారు ముఖ్యమంత్రి. కానీ ఇప్పుడు అధి ష్టానం చేతిలో పిల్లిలా తయార య్యారు. అధికార పార్టీలో ఉంటే ప్రశ్నించే అవకాశం ఉండదు. నేను పది రోజులుగా తెలంగాణ వ్యాప్తం గా ఎంతోమందితో భేటీలు, మీటిం గులు నిర్వహించాను.
అడ్వకేట్లతో, డాక్టర్లతో, నిరుద్యోగులతో, ఉపా ధ్యాయులతో, ఉద్యోగులతో, అంగ న్ వాడీలతో, ప్రైవేట్ ఉద్యోగులతో సమావేశాలు జరిగాయి. వారం దరూ ఎన్నో బాధలు చెప్పుకు న్నారు. శాసన సభలో కొట్లాడడా నికి మనపార్టీ వాళ్లున్నారు. అలాగే శాసన మండలిలో కూడా ఏవీఎన్(AVN) రెడ్డి గారితో పాటు ప్రేమేందర్ రెడ్డి కూడా కొట్లాడడానికి రెడీగా ఉన్నా రు. గత రెండు దశాబ్దాలుగా ప్రజాజీ వితంలో ఉన్నాం. ప్రజల పక్షాన నిల బడి కొట్లాడడానికి బీజేపీ పార్టీ ఎప్పు డూ సిద్దంగా ఉoటుంది.” అని పేర్కొన్నారు. ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేయడం అసాధ్యమని మాజీ మంత్రి బీజేపీ(BJP) నేత ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మహబూబా బాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో, పాలకుర్తి నియోజకవర్గం స్థాయి, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల ఎన్నికల సందర్భంగా పట్టభ ద్రుల ఆత్మీయ సమ్మేళన కార్యక్ర మంలో ఈటల మాట్లాడుతూ ఆగ స్టు 15 లోపల రుణమాఫీ చేయడం అసాధ్యమని అన్నారు. ఇంత తక్కువ కాలంలో ప్రజల చేత చీత్క రింపబడిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి కాంగ్రెస్(Congress) ప్రభుత్వానిది అన్నారు. తెలంగాణలో నిరుద్యోగులను మో సం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభు త్వానికి దక్కుతుందని, ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం నిరు ద్యోగులకు 4000 రూపాయల నిరు ద్యోగ భృతి ఇస్తానని ఇప్పటికీ అమలు చేయలేదన్నారు.
గత బీఆర్ఎ ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్(Congress) ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేశాయన్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించలేని పరి స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించుకోవాలని నిరుపేదలు ఆస్తుల అమ్మి వైద్యం చేయించుకుంటున్నారని తెలిపారు. నిరుపేదలకు వైద్యం ఖర్చులు పెట్ట లేని కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు వేలకోట్ల రూపాయలు ఇస్తున్నారని అన్నారు.
August 15th loan waiver is biggest joke