Warangal Kcr road show :కేంద్రంలో హంగ్ మనమే కింగ్
లోక్ సభ ఎన్నికల్లో కేంద్రంలో హంగు ప్రభు త్వం తప్పదని, అందులో బిఆర్ ఎస్ కింగ్ మేకర్ గా అనివార్యంగా అవతరిస్తుందని బిఆర్ఎస్ అధి నేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు
కేంద్రంలో చక్రం తిప్పేది కూడా మనమే
నిర్బంధాలకు బయపడకుండా
పేగులు తెగేదాకా కొట్లాడుతాం
తాటాకు చప్పుళ్ళకు భయపడితే అసలు తెలంగాణ వచ్చేదా
నా గుడ్లు పీకుతాడట, చెడ్డీ లాగు తాడంట ఇదేనా సీఎం స్థాయి భాష –వరంగల్ రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
ప్రజా దీవెన, వరంగల్ : లోక్ సభ ఎన్నికల్లో కేంద్రంలో హంగు ప్రభు త్వం తప్పదని, అందులో బిఆర్ ఎస్ కింగ్ మేకర్ గా అనివార్యంగా అవతరిస్తుందని బిఆర్ఎస్ అధి నేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్(KCR) పేర్కొన్నారు. కేంద్రంలో కీలకంగా మారితే తెలంగాణ హక్కుల కోసం కొట్లాడవచ్చని ఆశాభావం వ్యక్తంచేశారు. ఆదివారం హన్మ కొండ చౌరస్తాలో జరిగిన బీఆర్ఎస్ రోడ్ షోలో ఆయన మాట్లాడారు
గోదావరి నీళ్లను తమిళనాడు, కర్ణా టకకు తరలించేందుకు ప్రధాని మో దీ కుట్రలు చేస్తున్నారని ఆరోపిం చారు. రాష్ట్ర ప్రభుత్వం నోరుమూ సుకుని కూర్చోవడంలో మతలబేం టని ప్రశ్నించారు.ఇప్పటికే కృష్ణా నీళ్లను కేఎంబీఆర్ కు అప్పగించా రని, బీజేపీకి ఓటేస్తే మోసపో తామని, కాంగ్రెస్(Congress) వాగ్దానాలను నిల బెట్టుకోలేదని విమర్శించారు. బీజే పీ ప్రమాదకరమైన పార్టీ అని పదేళ్ల కింద నల్లధనాన్ని వెనక్కితీసుకొచ్చి జన్తన్ ఖాతాల్లో ప్రతి ఒక్కరికీ రూ.15 లక్షల చొప్పున జమచేస్తాన ని హామీ ఇచ్చారని. అది జరగలేద ని విమర్శించారు.
అమృత్కాల్ అచ్చేదిన్ రాలేదని, సచ్చేదిన్ మాత్రం వచ్చిందని ఎద్దేవా చేశారు. కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ వస్తే దాన్ని ప్రధాని తన సొంత రాష్ట్రానికి తర లించారని మండిపడ్డారు. రూపా యి విలువ దారుణంగా పడిపో యిందని, 18 లక్షల కేంద్ర ప్రభుత్వో ద్యోగాలు ఖాళీగా ఉంటే భర్తీ చేయ డం లేదని ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్ పై కస్సు బుస్సు….కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పై కేసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మన ఎమ్మెల్యేలు హామీ లపై నిలదీస్తే కేసీఆర్ నీ గుడ్లు పీకి గోలీలు ఆడుకుంటా, పేగులు తీసి మెడలో వేసుకుంటా, ఆఖరికి నా చెడ్డీ కూడా గుంజుకుంటా అని వ్యా ఖ్యలు చేస్తున్నాడని, నేను పదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడానా, నా నోట ఇలాంటి మాటలు ఎప్పుడైనా విన్నారా ఇదేనా సీఎం మాట్లాడే భాష అని నిలదీశారు.
తనను చర్లపల్లి జైలులో వేస్తానని సీఎం అంటున్నారని గుర్తుచేశారు. జైళ్ల కు, తోకమట్టకు నేను భయపడ తానా కేసీఆర్ జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదా, తెలంగాణ కోసం ఎన్ని దెబ్బలు తిన్నాం ఎన్ని నిరాహార దీక్షలు చేశాం, ఎన్ని రాజీనామాలు చేశాం,ఎన్ని సారు పదవులను ఎడమకాలి చెప్పులా విసిరేశాం మేంగిట్లభయపడి ఉంటే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నల వ ర్షం కురిపించారు.
రేవంత్ కు తెలం గాణ(Telangana) చరిత్ర, భూగోళం తెలియదని ఇటీవల ఎక్కడో మాట్లాడుతూ కృష్ణానదిని కూడా తానే కట్టినట్లు చెప్పారని, ఎక్కడైనా ఎవరైనా నదులను కడతారా అని ప్రశ్నిం చారు. రేవంత్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోలిం గ్ జరిగిందని ఎద్దేవా చేశారు. తెలం గాణ ఉద్యమం అయిపోలేదని, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం మరో ఉద్యమం చేపట్టాల్సిన అవసరం అనివార్యమైందనిపిలుపునిచ్చారు.
BRS king maker in Parliament elections