Tinmar mallanna: బ్లాక్ మెయిలర్‌గా నిరూపిస్తే బరి నుంచి తప్పుకుంటా
కేసీఆర్ ఇల్లంతా దొంగల ముఠానేనని, అధి కారాన్ని అడ్డుపెట్టుకొని దోపిడే పర మావధిగా పాలించారని వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్య ర్థి తీన్మార్ మల్లన్న ఆరోపించారు.
ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న
ప్రజా దీవెన, హనుమకొండ: కేసీఆర్(KCR) ఇల్లంతా దొంగల ముఠానేనని, అధి కారాన్ని అడ్డుపెట్టుకొని దోపిడే పర మావధిగా పాలించారని వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్య ర్థి తీన్మార్ మల్లన్న ఆరోపించారు. శుక్రవారం హనుమకొండ కాంగ్రెస్(Congress) కార్యాలయంలో హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద ర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావే శంలో ఆయన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్‌రావులపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ వనరు లను కేసీఆర్ కుటుంబం దోచుకుంద న్నారు.
భూములను కబ్జా చేశారని ఆరోపించారు. వేల కోట్ల ప్రజాధనా న్ని స్వాహా చేశారన్నారు. మళ్లీ మాయమాటలతో ప్రజలను నమ్మిం చే యత్నం చేస్తున్నారని విమర్శిం చారు. జూన్ 4 తరువాత కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీశ్‌రావు(Harish Rao)జైలుకే అని తీన్మార్ మల్లన్న జోస్యం చెప్పారు. అక్రమాల చిట్టా బయ టకు వస్తుందన్నారు. ఇప్పటికే కేసీ ఆర్ కూతురు కవిత లిక్కర్ స్కామ్ లో జైలు పాలయ్యారని, ఇక మిగ తా వారే మిగిలారన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ ఎస్(BRS) దుకాణం బంద్ కానుంద న్నారు. కేసీఆర్ దత్తపు త్రుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అని, ప్రజలను ఆయన నమ్మించి మోసం చేశారని తీన్మార్ మల్లన్న ఆరోపిం చారు.
అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly elections) బీఆర్‌ఎ స్‌కు లబ్ధిచేకూర్చే వ్యూహంలో భాగంగా ప్రవీణ్‌కుమార్ రాజకీయ ప్రవేశం జరిగిందన్నారు. ఇదంతా కేసీఆర్‌తో జరిగిన రహస్య ఒప్పం దమన్నారు. దీనిపై గతంలోనే తాను వాస్తవాలు చెప్పినట్లు వెల్ల డించారు. తనను బ్లాక్ మెయిల ర్‌గా చెబుతున్న కేటీఆర్(KTR) ఈ విష యాన్ని నిరూపించాలని డిమాండ్ చేశారు. ఏం బ్లాక్ మెయిల్ చేశానో నిరూపిస్తే పట్టభద్రుల ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకుంటానని వెల్ల డించారు. ఫోన్ ట్యాపింగ్(Phone tapping)వంటి నీచమైన చర్యలకు పాల్పడిన కేసీ ఆర్, కేటీఆర్‌లు ఇతరులపై బురద చల్లడం సిగ్గు చేటన్నారు. తాను ప్రజల తరపున ప్రశ్నించానే తప్ప ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని చెప్పారు. పట్టభద్రుల ఉప ఎన్ని కలో తనను గెలిపిస్తే సేవ చేసి రు ణం తీర్చుకుంటానని తీన్మార్ మల్ల న్న(Tinmar Mallanna)పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎం.డి. రియాజ్, అజ్మతుల్లా హుస్సే నీ, అజీజ్‌ఖాన్, కత్తి వెంకటస్వామి, బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బంక సరళా తదితర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నా రు.
Tinmaar mallanna black mailer