CM RevanthReddy: దేశంలో మోదీ వ్యతిరేక పవనాలు
దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి మోడీ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఖాయం
లోక్ సభ ఎన్నికలు తమ వంద రోజుల పాలనకు రెఫరెండo
ముస్లిం రిజర్వేషన్ల రద్దుపై ఏపీలో కూటమి ఎందుకు చెప్పడం లేదు
కొడంగల్ లో మీడియాతో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి
ప్రజా దీవెన, కొడంగల్: దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి మోడీ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ఫలితా ల తర్వాత కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 33.5 శాతం ఓట్లు వచ్చాయని, ఈ ఎన్ని కల్లో అంతకు మించి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ కూడా ఈ ఎన్నికలు మోదీ పాలన కు రెఫరెండం అని చెబుతోందని గుర్తు చేస్తూ మాకు కూడా లోక్ సభ ఎన్నికలు తమ వంద రోజుల పాల నకు రెఫరెండమని ప్రకటించారు. సెప్టెంబర్ 17, 2025తో మోదీ 75 ఏళ్లు నిండుతాయని, వయస్సు పరిమితి అమలు చేస్తే ఎవరు ప్రధాని అనేది బీజేపీ తేల్చుకోవా లని సూచించారు. కొడంగల్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.
మ్యాజిక్ ఫిగర్ రాకపోతే బీజేపీ, ఎన్డీఏకు దేశంలో మద్దతు ఇవ్వడా నికి ఎవరూ సిద్ధంగా లేరన్నారు. బీజేపీ 336 సీట్లలో మాత్రమే పోటీ చేస్తోందని, 400 సీట్లు ఎట్లా సాధ్య మని ప్రశ్నించారు. 13 ఏళ్లు సీఎంగా, 10ఏళ్లు పీఎంగా పని చేసిన మోదీ మన రాజ్యాంగాన్ని పూర్తిగా అర్ధం చేసుకోలేదన్నారు. దేశంలో మతపరమైన రిజర్వేషన్లు లేవని, సామాజికంగా వెనుకబడిన వారికి మాత్రమే దేశంలో రిజర్వే షన్లు అమలులో ఉన్నాయన్నారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఏపీలో ఎన్డీఏ కూటమి ఎందుకు చెప్పడంలేదని ప్రశ్నించారు. దేశ ప్రజలకు మోదీ మాయమాటలు చెబుతున్నారన్నారు.ఇండియా కూటమి పేరుతో మేం ప్రజలను ఓట్లు అడుగుతోంటే, మోదీ పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోందని ఎద్దేవా చేశారు.
ఎవరు నామ్ దార్ ఎవరు కామ్ దార్ దీన్ని బట్టి తెలుస్తోంద న్నారు. ఎవరు అట్టడుగు వర్గాల ప్రజల కోసం పని చేస్తున్నారో చర్చకు సిద్ధమా అని సవాలు విసిరారు.మోదీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడినా, నవనీత్ కౌర్ 15సెకన్ల కామెంట్స్ పై చర్యలు లేవన్నారు. బీజేపీ నేతలపై ఎంహె చ్ఏ కంప్లైంట్ చేయదు కానీ ఒక వీడియో వైరల్ కేసులో తమపై ఎంహెచ్ఏ రంగంలోకి దిగిందన్నా రు. ఏజెన్సీలను బీజేపీ దుర్విని యోగం చేస్తుందనడానికి ఇది నిదర్శనమన్నారు.
బీజేపీ వాషింగ్ మెషిన్ లో చేరగానే కొందరు నాయ కుల అవినీతి మరకలు తొలగిపో యాయా అని ప్రశ్నించారు.కాంగ్రెస్ కు ఆదాని, అంబానీ డబ్బులు ఇస్తున్నారన్న మోదీని ఒక్కటే అడు గుతున్నా ఈడీ, సీబీఐ, ఐటీ అధికా రులను పంపి ఆదానీ, అంబానీల ఆఫీసులపై, ఇళ్లల్లో సోదాలు నిర్వ హించండన్నారు. మోదీ ఆరోపణ లు నిజమైతే ఎందుకు వారిపై చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ చేసి తీరుతామన్నారు.
రుణమాఫీ ఏమీ అసాధ్యమైన టాస్క్ కాదని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను దెబ్బతీసి పెట్టుబడులు గుజరాత్ కు తరలించుకుపోవాలని బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. యూపీ పరిస్థి తిని తెలంగాణలో తీసుకురావాలని ప్రయత్నిస్తోందన్నారు. కేసీఆర్ పై తనకు సానుభూతి ఉందన్నారు. మానసిక ఒత్తిడితో, నిరాశతో భావోద్వేగంతో ఆయన ప్రకటనలు చేస్తున్నారన్నారు. కేసీఆర్ కూడా కేఏ పాల్ లాగే మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
Anti-Modi winds in India