BRS MLA Jeevan Reddy:ఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై భూకబ్జా కేసు
భారాస మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై చేవెళ్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. భూ కబ్జా చేసి, అనుచరులతో బెది రించారని సామ దామోదర్ రెడ్డి ఫిర్యాదు మేరకు జీవన్ రెడ్డి తో పాటు ఆయన కుటుంబ సభ్యు లపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.
బాధితుడి ఫిర్యాదుతో చేవెళ్లలో పలు సెక్షన్ల కింద నమోదు
ప్రజా దీవెన, వికారాబాద్: భారాస మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి(Jeevan Reddy) పై చేవెళ్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. భూ కబ్జా చేసి, అనుచరులతో బెది రించారని సామ దామోదర్ రెడ్డి ఫిర్యాదు మేరకు జీవన్ రెడ్డి తో పాటు ఆయన కుటుంబ సభ్యు లపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. రంగారెడ్డి(Ranga Reddy) జిల్లా ఈర్లపల్లి గ్రామంలో సర్వే నెంబరు 32, 35, 36, 38లో 20 ఎకరాల 20గుంటల భూమిని సామ దామోదర్ రెడ్డి కొనుగోలు చేశారు. అతని తండ్రి పరమ్ రెడ్డి(Param Reddy) పేరుతో ఫంక్షన్ హాల్ నిర్మించారు. 2023లో జీవన్ రెడ్డి అతని అనుచరులు ఫంక్షన్ హాల్ కూల్చివేసి మరో భవనం నిర్మించా రని ఫిర్యాదులో పేర్కొన్నారు.
విష యం తెలిసి అక్కడకు వెళ్లిన తమ ను బెదిరించారని, బిహార్,(Bihar) పంజాబి కి చెందిన గ్యాంగు వాచ్ మెన్ లుగా పెట్టుకున్నారని తెలిపారు. రెండ్రోజు ల క్రితం తమ భూమిలోకి వెళితే మారణాయుధాలతో బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జీవన్ రెడ్డి తన భూమిని కబ్బా చేశారని చేవెళ్ల(Chevella) పీఎస్ లో దామోదర్ రెడ్డి అనే వ్యక్తి శుక్రవారం కేసు నమోదు చేశారు.ఎర్లపల్లిలో 20 ఎకరాల 20 గుంటల భూమిని 2022లో కొనుగో లు చేశానని బాధితుడు చెబుతు న్నాడు. అయితే సర్వేనెంబర్ 32, 35, 36, 38లో ఓ ఫంక్షన్ హాల్ను గతంలో నిర్మించుకున్నానని, తన భూమి పక్కనే జీవన్ రెడ్డి భూమి ఉoదని చెప్పాడు.
2023లో ఫంక్షన్ హాల్ని పడగొట్టి జీవన్ రెడ్డి తన భూమిని కబ్జా చేశాడని సదరు బాధి తుడు ఆరోపిస్తున్నాడు. కబ్జా చేసిన భూమికి రక్షణగా పంజాబ్(Punjab) గ్యాంగ్ను జీవన్ రెడ్డి పెట్టి తనను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తు న్నాడు. తన భూమిని తనకు ఇ వ్వాలని అడిగితే పంజాబ్ గ్యాంగ్ తో మారణాయుధాలతో దాడి చేసి భయాబ్రాంతులకు గురి చేశారని సదరు బాధితుడు ఆందోళన వ్యక్తం చేశాడు. తన భూమిని జీవన్ రెడ్డి నుంచి విడిపించాలని చేవెళ్ల పోలీ సులకు ఫిర్యాదు చేశానని తెలి పారు. తనకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని, జీవన్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని సదరు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులపై ఆరు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Land grab case against BRS MLA Jeevan Reddy