Praja Deveena
Newspaper Banner
Date of Publish : 21 July 2026, 3:57 am Posted by : praja deveena

horrific family road accident : బిగ్ బ్రేకింగ్, ఎయిర్‌పోర్ట్ ప్రయా ణంలో ఊహించని విషాదం, రో డ్డు ప్రమాదంలో చిన్నారితో సహా ముగ్గురు దుర్మరణం 

horrific family road accident : ప్రజా దీవెన, సంగా రెడ్డి:మరొక కొ న్ని గంటల్లో విమానం ఎక్కి తమ గమ్యస్థా నానికి చేరుకో వాల్సిన ఆ కుటుంబ ప్రయాణం.. మధ్య లో నే అర్ధాంతరంగా ముగిసిపోయింది. డెస్టినేషన్ మారినా, వారు చేరుకోవాల్సిన ఎయిర్‌పోర్టుకు కాకుండా అనంత లో కాలకు వెళ్ళిపోవాల్సి రావడం తీవ్ర విషాదాన్ని నింపింది. సంగారెడ్డి జిల్లా కల్లేర్ మండలం బాచుపల్లి వద్ద జాతీయ రహదారిపై దారు ణ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మ హారాష్ట్రలోని నాందేడ్ నుండి హైదరాబాద్ శంషాబాద్ ఎ యిర్‌ పోర్టుకు కారు లో బయలుదేరిన ఒక కుటుంబం, బా చుపల్లి సమీపంలోకి రాగానే ఘోర ప్రమాదానికి గురైంది.

 అక్కడికక్కడే ముగ్గురు మృత్యువాత

ప్రమాద తీవ్రతకు కారులోని ఒక పురుషుడు, ఒక మహిళ తో పా టు కేవలం నాలుగేళ్ల పసిపాప అక్కడికక్కడే ప్రాణా లు విడిచారు.నాందేడ్ నుంచి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ చే రుకుని విమానం ఎక్కాల్సి ఉండగా, ఈ లోపే మృత్యువు ప్ర మాదం రూపంలో ముంచెత్తింది. ప్రమాద ధాటికి కారు తీ వ్రంగా దె బ్బతిన్నట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో వెంటనే రెస్క్యూ బృందాలు, పోలీ సులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సంగా రెడ్డి పోలీ సులు కేసు నమోదు చేసుకుని, ప్రమాదానికి గల ఖచ్చి త మైన కారణాలు (డ్రైవర్ నిద్ర మత్తు లేదా వేగమా) అనే కో ణంలో విచారణ జరుపుతున్నారు. పండంటి చిన్నారితో స హా ముగ్గురు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.