Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Modi bye bye: మొన్న కేసీఆర్ కు – బై బై నేడు మోదీ కి

తెలంగాణలో మొన్నటికి మొన్న జరిగిన శాసన సభ ఎన్నికల్లో కేసీఆర్ కు బై బై చెప్పామని, ప్రస్తుత లోక్ సభ ఎన్ని కల్లో ప్రధాని మోడీ పార్టీకి బై బై చెప్పాల్సిన సమయం ఆసన్న మైందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు

అపర దోపిడీదారులనుంచి అనివార్యమైన విముక్తి
కొమురెల్లి మల్లన్న సాక్షిగా రుణ మాఫీ అంటూ సీఎం మరో ప్రమా ణం
సిద్దిపేటలో హరీశ్‌రావుతో రాజీనా మా చేయించి కొత్త ఎమ్మెల్యేను గెలి పిస్తా
దుబ్బాకకు రఘునందన్‌ తెచ్చిం దేమి లేదు, గాడిద గుడ్డు తప్ప
సిద్దిపేట, ఆసిఫాబాద్‌, కుత్బుల్లా పూర్‌ సభలు, రోడ్‌షోలలో సీఎం రేవంత్‌రెడ్డి

ప్రజా దీవెన, సిద్దిపేట: తెలంగాణలో మొన్నటికి మొన్న జరిగిన శాసన సభ ఎన్నికల్లో కేసీఆర్ కు(KCR) బై బై చెప్పామని, ప్రస్తుత లోక్ సభ ఎన్ని కల్లో ప్రధాని మోడీ(Modi) పార్టీకి బై బై చెప్పాల్సిన సమయం ఆసన్న మైందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అ రుంధతి సినిమాలో బొమ్మాళి లాగా సిద్దిపేటను పట్టిపీడిస్తున్న బ్రహ్మరా క్షసుల నుంచి విముక్తి కలిగించడా నికే ఈ గడ్డ మీదఅడుగుపెట్టానని పేర్కొన్నారు.

నలభై ఏళ్ల నుంచి సిద్దిపేట నియోజకవర్గాన్ని మామ అల్లుడు పాపాల భైరవు ల్లాగా పట్టి పీడిస్తున్నారని ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) బీఆర్‌ఎస్‌ నేతలు కేసీఆర్‌, హరీశ్‌రావుపై విమర్శల వర్షం కురిపించారు. మెదక్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా గురువారం రాత్రి సిద్దిపేట కార్నర్‌ మీటింగ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసం గించారు. ఏనుగులు తినే మామ పోతాపోతా పీనుగులను తినే అల్లుడిని తెచ్చి పెట్టిండని ఎద్దేవా చేశారు.

1980లో మెదక్‌ నుంచి ఇందిరాగాంధీని(Indira Gandhi)గెలిపించిన ఘనత ఇక్కడి ప్రజలదేనని గుర్తు చేశారు. అందుకు కృతజ్ఞతగా ఇందిర హ యాంలో ఈ ప్రాంతాన్ని పారి శ్రామి కంగా తీర్చిదిద్దారన్నారు. ఇ ప్పుడు ఇదే నియోజకవర్గం నుంచి బీసీ యువకుడికి అవకాశం కల్పించా మన్నారు. కాంగ్రెస్‌(Congress) పార్టీ అధి కారం లోకి వచ్చాక బీసీలకు పెద్ద పీట వేశామని, పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖలకు మంత్రి పదవులు ఇచ్చామని, 16 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

దొరల గడీ లను బద్దలు కొట్టాలంటే కాంగ్రెస్‌కు ఓటు వేయాలని, లేదంటే బానిస బతుకులు తప్పవని పిలుపునిచ్చా రు. ఎక్కడి నుంచో వచ్చిన వెంకట్రా మారెడ్డి (బీఆర్‌ఎస్‌ అభ్యర్థి) చరిత్ర మీకు తెలియదా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌(BRS) పార్టీ డిపాజిట్‌ గల్లంతు చేయాలని సూచించారు. వాడు పోతే వీడు, వీడుపోతే వాడు అన్న ట్లుగా ఒకరుపోతే ఒకరు ఈ ప్రాం తంలో ఆధిపత్యం చెలాయిస్తు న్నారని.. చంద్రశేఖర్‌రావు, రఘు నందన్‌రావు, హరీశ్‌రావు, తారక రామారావు అందరూ ఒక్కటేనని రేవంత్‌ విమర్శించారు.

బీసీ బిడ్డకు నీలం మధు కు ఓట్లు వేసి గెలి పించాలని గెలిపిస్తే ముదిరాజ్‌కు(Mudiraj) మంత్రి పదవి ఇస్తానని, బీసీ–డీ నుంచి బీసీ (ఎ) కు ముదిరాజుల సామాజికవర్గాన్ని మార్చుతానని హామీ ఇచ్చారు. యూపీఏ పదేళ్ల పాలనలో తెలంగాణకు అనేక ప్రాజె క్టులు, విద్యా సంస్థలు అందిస్తే మోదీ పదేళ్ల పాలనలో గాడిదగుడ్డు మాత్రమే ఇచ్చారని దుయ్యబట్టా రు. దుబ్బాకలో కూడా రఘునంద న్‌రావు వేల కోట్ల నిధులు తెస్తానని చెప్పి, గాడిదగుడ్డు ఇచ్చారని ఎద్దే వా చేశారు.

పంద్రాగస్టులోగా రైతుల రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనా మా చేస్తానని సిద్దిపేట ఎ మ్మెల్యే హరీశ్‌రావు(Harish Rao)విసిరిన సవాల్‌ ను గుర్తు చేస్తూ కొమురవెల్లి మల్లన్న సాక్షిగా రైతులందరికీ పంద్రాగస్టులోగా రూ.2 లక్షల రుణమాఫీ చేసి హరీశ్‌రావుతో రాజీనామా చేయిస్తానని సీఎం ప్రకటించారు. రుణమాఫీ చేసి లక్ష మందితో ఇదే చౌరస్తాలో సభ పెడ తానని చెప్పారు. హరీశ్‌రావు రాజీ నామాతోపాటు లెక్కపత్రం సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. సిద్ది పేటకు కొత్త ఎమ్మెల్యేను గెలిపి స్తానని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్లుగానే పంద్రాగస్టు రోజున సిద్దిపేటకూ స్వాతంత్య్రం వస్తుందన్నారు.

మేమిద్దరం ఒకే ఆత్మ…పదవుల ప రంగా పలువురికి మంచి అవకా శాలు కల్పించామని సీఎం చెబు తుండగా ఆయనతో పాటే ఉన్న అద్దంకి దయాకర్‌ గురించి కార్య కర్తలు నినదించారు. దీంతో రేవంత్‌ స్పందిస్తూ దయాకర్‌కు జర పెద్దది ఇద్దామనే అనుకున్న, దయాకర్‌దే ముఖ్యమంత్రి కుర్చీ నా పనంతా స గం ఆయననే చేస్తుంటడు, దయా కర్‌, నేను వేరు కాదు, ఒకే ఆత్మ కాబట్టి ఆయనకు మంచి పదవి ఇస్తాం, కష్టపడ్డవాళ్లను గుర్తిస్తాం అని ప్రకటించారు. కాగా, బీఆర్‌ఎస్‌(BRS) పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మె ల్సీ ఆర్‌.సత్యనారాయణకు సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Modi defeat in Parliament elections