KCR and Revanth Reddy: కొడంగల్ లో రేవంత్ చింతమడకలో కేసీఆర్
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో విఐపి రాజకీయ నేత లు, సినీ ప్రముఖులు, మేధావులు ఎక్కడి వారు అక్కడే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
స్థానికంగా ఎక్కడి రాజకీయ నేతలు అక్కడే ఓట్లు
ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల(Lok sabha elections) నేపథ్యంలో విఐపి రాజకీయ నేత లు, సినీ ప్రముఖులు, మేధావులు ఎక్కడి వారు అక్కడే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వికారాబాద్(Vikarabad) జిల్లా కొడంగల్ లోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాల లోని పోలింగ్ కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి, భార్య గీతారెడ్డి, కుమార్తె నైనీశా రెడ్డితో కలిసి ఓటు వేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటును సద్విని యోగం చేసుకోవాలని సూచించా రు. ఖమ్మం(Khammam) జిల్లాలోని మధిరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుటుంబసభ్యు లతో కలిసి ఓటు వేశారు.
మంత్రి దామోదర్ రాజ నర్సింహ తన కూతురు త్రిషతో కలసి జోగిపేటలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, సతీమణి శోభతో కలిసి సిద్దిపేట జిల్లా చింతమడకలో ఓటు వేశారు. ముఖ్యమంత్రి పదవి కోల్పోయాక మొదటిసారి చింతమడకకు వచ్చిన కేసీఆర్ ను చూసేందుకు, మాట్లా డేందుకు గ్రామస్థులు పోటీపడ్డారు. సిద్దిపేటలోని భారత్ నగర్ అంబిటస్ పాఠశాలలో ఎమ్మెల్యే హరీశ్ రావు, ఆయన భార్య శ్రీనిత, కుమా రుడు అర్చిశ్మోన్ తో కలిసి ఓటు హక్కును విని యోగించుకు న్నారు. జూబ్లీహిల్స్ లోని ఓబుల్ రెడ్డి స్కూల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
అదేవి ధంగా జూబ్లీహిల్స్ లో డీజీపీ రవి గుప్తా, ఎస్ఆర్ నగర్ లో సీఈవో వికాస్ రాజ్(CEO Vikas raj), సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ(NV Ramana) ఓటు వేశారు. బంజ రాహి ల్స్ రోడు నంబర్ 14లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయన సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు ఓటు హక్కు వినియోగిం చుకున్నారు. తొలిసారి ఓటుహక్కు వినియోగించుకున్న హిమాన్షును మీడియా ప్రతినిధులు పలకరించేం దుకు ప్రయత్నించగా నవ్వుతూ వెళ్లిపో యారు. కొద్ది రోజుల క్రితం మోకాలి మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న రాజ్యసభ సభ్యు డు కేశవ రావు వీల్ చైర్ లో వచ్చి ఓటు హక్కు వినియోగిం చుకు న్నారు.
Revanth reddy and KCR cast vote