Rain: వ్యవసాయ రంగాన్ని పరిరక్షించాలి
అకాల ఈదు రు గాలులు, వర్షాల కారణంగా రైతాంగం పరిస్థితి ములిగే నక్క మీద తాడి పండు పడ్డ చందంగా దయనీయంగా తయారైందని తెలుగు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వరరావు చెప్పారు.
ప్రజా దీవెన, కోదాడ: అకాల ఈదు రు గాలులు, వర్షాల(Rain) కారణంగా రైతాంగం పరిస్థితి ములిగే నక్క మీద తాడి పండు పడ్డ చందంగా దయనీయంగా తయారైందని తెలుగు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వరరావు చెప్పారు. ఓప్రక్క వర్షాల వల్ల కల్లాలు, ఐకేపీ కేంద్రాలు, మార్కెట్ లలో ఉన్న ధాన్యం తడిసి పోగా, మరోపక్క ఈదురు గాలుల వల్ల మామిడికాయలు రాలిపోయి రైతులకు తీవ్ర నష్టం కలిగిందని తెలిపారు. ఈ యాసంగిలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పంట దిగుబడి తగ్గిందని, ఇప్పుడు కురిసిన అకాల వర్షాల వల్ల ఆ పండిన అరకొర ధాన్యం తడిసిందని చెప్పారు.
ధాన్యం తడిసి రంగు మారిందని, మొలకలు వచ్చాయని కొర్రీలు పెట్టకుండ ప్రతి ధాన్యపు గింజను(grain of wheat) మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతాంగాన్ని నష్టపోకుండ ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈదురు గాలులతో నేల రాలిన మామిడికాయల్ని(mango) చూసి లబోదిబోమని రైతాంగం రోదిస్తున్నా సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు కాని, ప్రజాప్రతినిధులు కాని నేటికీ తోటలను సందర్శించటం, నష్టాన్ని అంచనా వేయకపోవడం భాద్యతారాహిత్యమని విమర్శించారు. జరిగిన పంట నష్టాన్ని ప్రభుత్వం తక్షణమే అంచనా వేసి, నష్ట పరిహారాన్ని చెల్లించి రైతాంగాన్ని ఆదుకొని వ్యవసాయ రంగాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేసారు.
Agriculture sector protected