Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kodad MLA Padmavathi Reddy: ఎమ్మెల్యే చేతులు మీదుగా బ్రోచెరు ఆవిష్కరణ

ప్రజా దీవెన, కోదాడ:
Kodad MLA Padmavathi Reddy: కళా ప్రపూర్ణ, పద్మ విభూషణ్, డాక్టర్. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని దేశవ్యాప్తంగా జరిగే సామాజిక సేవ కార్యక్రమాల బ్రోచర్లను ఆదివారం చిరంజీవి యువత సూర్యపేట జిల్లా అధ్యక్షులు గుండెపంగు రమేష్ ఆధ్వర్యంలో MLA క్యాంపు కార్యాలయంలో స్థానిక శాసన సభ్యురాలు నలమాద పద్మావతి రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిరంజీవి అభిమానులు సామాజిక సేవలో విరివిగా పాల్గొనాలని రక్తదానం నేతదానం లాంటి సామాజిక సంక్షేమ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

విశిష్ట అతిథిగా విచ్చేసిన అఖిలభారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ బైరు వెంకన్న గౌడ్ మాట్లాడుతూ.. రక్తం అవసరమైన నిరుపేద రోగులకు చిరంజీవి అభిమాన సంఘ నాయకులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్నారని, పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటుటలో కూడా భాగస్వాములు అవుతున్నారని, పలు సామాజిక, సంక్షేమ కార్యక్రమంలో ముందుంటారని తెలిపారు.ఈ కార్యక్రమం లో సూర్యాపేట జిల్లా చిరంజీవి యువత నాయకులు ఓరుగంటి పాండు, అబ్బీమల్ల. రవి, వెంకట రెడ్డి తదితరులు పాల్గొన్నారు.