Congress: కాంగ్రెస్ నేతను కాల్చి..ఖననం చేసి
వ్యక్తిగత వివాదాల్లో చీకి చలికి గాలి వానల మారి ఓ వ్యక్తి హత్యకు దారి తీసిన సంఘటన సంచలనం సృష్టించింది. రియల్‌ఎస్టేట్ వివాదాలతో అపహ రణకు గురై ఆ క్రమంలోనే దారుణ హత్యకు గురైన సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.
జగ్గయ్యపేటలో దారుణ హత్య చేసిన నిందితులు
పశువుల కాపరుల సమాచారం తో వెలుగులోకి
ప్రజా దీవెన, సూర్యాపేట: వ్యక్తిగత వివాదాల్లో చీకి చలికి గాలి వానల మారి ఓ వ్యక్తి హత్యకు దారి తీసిన సంఘటన సంచలనం సృష్టించింది. రియల్‌ఎస్టేట్ వివాదాలతో అపహ రణకు గురై ఆ క్రమంలోనే దారుణ హత్యకు గురైన సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. గత కొద్ది రోజులుగా ఆచూకీ లభించని సూర్యాపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వడ్డె ఎల్లయ్య మృతదేహం ఎట్టకేలకు లభ్యమైం ది. దాదాపు ఇరవై రోజుల క్రితం ఎల్లయ్య ప్రత్యర్థి, నాగారం మండ లం మాచిరెడ్డిపల్లికి చెందిన శ్రీకాం తాచారి పక్కా పథకం ప్రకారం ఎల్లయ్యను ఆంధ్రప్రదేశ్‌లోని జగ్గ య్యపేటకు రప్పించి, అపహరించి, హతమార్చిన విషయం తెలిసిందే.
భార్యాభర్తల పంచాయితీ తీర్చా లంటూ అపర్ణ అనే మహిళతో ఎల్ల య్యను జగ్గయ్యపేటకు రప్పించిన శ్రీకాంతాచారి అక్కడి రైల్వేస్టేషన్ రోడ్ సమీపంలో హతమార్చాడు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు శ్రీకాంతాచారిని అదు పులోకి తీసుకుని, ప్రశ్నిస్తే హత్య కేసు వెలుగులోకి వచ్చింది. అయితే మృతదేహం లభించకపోతే తాము కేసు నుంచి బయట పడవచ్చనే ఉద్దేశంతో శ్రీకాంతాచారి పోలీసు లను తప్పుదోవ పట్టించాడు. చేపల లారీలో మృతదేహాన్ని విశాఖకు తీసు కెళ్లి అక్కడ సముద్రంలో పారే సినట్లు వాంగ్మూలమిచ్చాడు.దీంతో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అక్కడ గాలింపు చేపట్టిన లాభం లేకుండా పోయింది.
బుధ వారం ఉదయం జగ్గయ్యపేట మండలం బండిపాలెం గ్రామ శివారులో ఏదో మృతదేహం దుర్వాసన వస్తోందంటూ పశువుల కాపరులు గ్రామ పెద్దలకు సమా చారం అందించారు. వారి ద్వారా విషయం తెలుసుకున్న వీఆర్వో బాబూరావు పోలీసులకు తెలిపా రు. జగ్గయ్యపేట సీఐ జానకీరాం తన సిబ్బందితో కలిసి అక్కడకు చేరుకున్నారు. దుర్వాసన వస్తున్న ప్రాంతంలో తాజాగా పూడ్చిన ఓ గోతి కనిపించడంతో అక్కడ తవ్విం చారు. సగం కాలిన శవాన్ని వెలికి తీశారు. జగ్గయ్యపేట తహసీల్దార్ సమక్షంలో పోస్టుమార్టం నిర్వహిం చారు. ఆ మృతదేహం ఎల్లయ్య దేనని గుర్తించారు. వెంటనే కుటుం బ సభ్యులకు సమాచారం అందించ డంతో వారు మృతదేహాన్ని గుర్తిం చారు.
నిందితుడు శ్రీకాంతాచారి పోలీసులను తప్పుదోవ పట్టించేం దుకే విశాఖ సముద్రంలో పారేశా మని చెప్పారని సీఐ వివరించారు. శ్రీకాంతాచారి తొలుత ఎల్లయ్య మృతదేహాన్ని కాల్చేందుకు ప్రయ త్నించారని చెప్పారు. మృతదేహం సగం కాలడంతో పాతిపెట్టినట్లు పేర్కొన్నారు. కాగా బుధవారం సాయంత్రం సూర్యాపేట జిల్లాలోని ఎల్లయ్య స్వగ్రామం యార్కారంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఎల్లయ్య మాజీ నక్సలైట్ కావడం తో అంత్యక్రియలకు పలువురు మాజీ మావోయిస్టులు హాజర య్యారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోద ర్‌రెడ్డి, తెలంగాణ పర్యాటక శాఖ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై ఎల్లయ్య మృతదేహానికి నివాళులు అర్పించారు.
Congress leader killed in suryapet