Disabled Corporation:కాంగ్రెస్ తోనే ప్రజా పాలన
నల్గొండ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కుందూరి రఘువీరా రెడ్డి నీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలి అని తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు.
ప్రజా దీవెన, కోదాడ: నల్గొండ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కుందూరి రఘువీరా రెడ్డి నీ(Raghuveera Reddy) అత్యధిక మెజార్టీతో గెలిపించాలి అని తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. మంగళవారం పట్టణంలోని పెరిక భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా పట్టణానికి విచ్చేసినట్లు తెలిపారు.
కాంగ్రెస్(Congress) తోనే ప్రజా పాలన జరుగు తుందని, బిజేపి వల్లే మత గర్షణలు జరుగుతున్నాయని ఆరోపించారు. రిజర్వేషన్లు ఎత్తివేయడానికే 400 సీట్లు బిజెపి ఎత్తుగడ అని, కాంగ్రెస్ పాలనపై అబద్ధపు ప్రచారం చేయ టం బీజేపీకి, బిఆర్ ఎస్ కి పనిగా మారిందని ఆరోపించారు. నిజ మైన లౌకికవాదం కాంగ్రెస్ లోనే ఉందనీ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపె ట్టింది అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ ఇచ్చింది. వంద రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని చేస్తే ఇంకా మిగిలిన రోజుల్లో ఇంకా ఎన్ని చేస్తుందోనని అన్నారు. 10 సంవత్సరాలు ఏం చేసినావ్ అని టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు. లక్షల కోట్ల అప్పులు తప్ప ఏమీ లేవని అన్నారు. వికలాంగులు, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అని అన్నారు. ఏమీ చేయని నువ్వు 10 సంవత్సరాలు పాలించి నీ కూతురు లిక్కర్ కేసులో అరెస్ట్ అయింది అని,. బిజెపికి అమ్ముడు పోయావని కెసిఆర్ ని ఘాటుగా విమర్శించారు.
బిఆర్ఎస్ అంటే బిజెపి అని బిజెపి అంటే బీఆర్ఎస్(BRS) అని రెండు ఒకటే అన్నారు. . బిజెపి ప్రభుత్వం ప్రజలని మోసం చేస్తుంది అని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో రఘువీరారెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ముందుగా మొదటిసారిగా పట్టణానికి తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య(Muthineni Veeraiah) రావడంతో పెరిక సంఘం నాయకులు ఘన స్వాగతం పలికినారు.
తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య , మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావును పేరిక సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బోలిశెట్టి నాగేంద్రబాబు, అమీనాబాద్ మాజీసర్పంచ్ ముత్తి నేని కోటేశ్వర రావు,, దొంగరి వేంకటేశ్వర్లు, మాజీ జెడ్పీటీసీ కోట మల్లికార్జునరావు, పాయ్యిలి కోటేశ్వరరావు, శ్రీనివాసరావు, బచ్చు అశోక్ , వార్డు కౌన్సిలర్ తిప్పిరి శెట్టి సుశీల రాజు, ,మహిళా అధ్యక్షరాలు అనురాధ, శ్రీనివాసరావు, నరేష్, వేంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు…
Congress rule with People