Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Municipal Labour: మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి..

కోదాడ మున్సిపల్ లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్  కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని.ప్రమీల, కమిషనర్ రమాదేవిలకు  వినతి పత్రం అందజేశారు.

ప్రజాదీవెన, కోదాడ: కోదాడ మున్సిపల్ లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్  కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం మున్సిపల్ చైర్ పర్సన్(Municipal Chairman Samineni Pramila) సామినేని ప్రమీల, కమిషనర్ రమాదేవి(Municipal Commissioner Ramadevi)లకు  వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్మికులు ప్రధాన సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లారు. పురపాలక సంఘం లో గత చాలా సంవత్సరాలుగా చాలీ, చాలని వేతనాలతో పనిచేస్తున్నామని  పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు  పెంచాలని పెంచకపోయినట్లయితే దుర్భరమైన జీవితం గడుపుతున్నామని తెలిపారు.

ప్రభుత్వం  కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలన్నారు. కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ కార్మికులను(Outsourcing of labour) పర్మినెంట్ చేయాలని కోరారు. ఈ సందర్భంగా చైర్మన్,కమిషనర్లు మాట్లాడుతూ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమం లో ఆర్థిక కౌన్సిలర్లు ఎస్కే షఫీ ఎస్ కె మదర్ సాహెబ్ యూనియన్ అధ్యక్షులు కొమ్ము. నాగేశ్వరరావు,కార్యదర్శి కుడుముల. గోపి,యలమర్తి. వెంకటేశ్వర్లు,నాగమణి,ధనమ్మ,బ్రహ్మం, మంగమ్మ,నాగరాజు, లింగమ్మ తదితరులు పాల్గొన్నారు.

contract and outsourcing of labour permanent