Desa ratna award: దేశ రత్న అవార్డుకు మాజీ సైనిక అధికారి మధుసూదన్ రావు ఎన్నిక.
కోదాడకు చెందిన మాజీ దేశ సైనిక అధికారి ఇండియాన్ వెటరన్ ఆర్గనైజేషన్ స్టేట్ కోఆర్డినేటర్, జిల్లా అధ్యక్షులు గుండా. మధుసూదన్ రావు చేస్తున్న సామాజిక సేవలను గుర్తించి రత్న పురస్కార్ జాతీయ కమిటీ దేశరత్న అవార్డుకు ఎంపికైన సందర్భంగా శనివారం కోదాడ పట్టణంలోని స్వర్గీయ కల్నాల్ సంతోష్ బాబు విగ్రహం వద్ద వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మధుసూదన్ రావును ఘనంగా అభినందించి సన్మానించారు.
వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అవార్డు గ్రహీతకు అభినందనలు……
కల్నాల్.సంతోష్ బాబు విగ్రహానికి ఘన నివాళులు.
ప్రజా దీవెన, కోదాడ: కోదాడకు చెందిన మాజీ దేశ సైనిక అధికారి ఇండియాన్ వెటరన్ ఆర్గనైజేషన్ స్టేట్ కోఆర్డినేటర్, జిల్లా అధ్యక్షులు గుండా. మధుసూదన్ రావు(Gunda Madhusudan Rao)చేస్తున్న సామాజిక సేవలను గుర్తించి రత్న పురస్కార్ జాతీయ కమిటీ దేశరత్న అవార్డుకు ఎంపికైన సందర్భంగా శనివారం కోదాడ పట్టణంలోని స్వర్గీయ కల్నాల్ సంతోష్ బాబు(Colonel Santosh Babu)విగ్రహం వద్ద వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మధుసూదన్ రావును ఘనంగా అభినందించి సన్మానించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో రెండు దశాబ్దాలకు పైగా విధులు నిర్వహించి కేంద్ర ప్రభుత్వం చే మధుసూదన్ రావు అనేక అవార్డులు పొందారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా సమాజ సేవ కోసం ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ స్థాపించి పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆయన సేవలకు గుర్తింపుగా దేశ రత్న అవార్డు(Desa Ratna Award)వచ్చిందన్నారు.
భవిష్యత్తులో మరెన్నో అవార్డులు పొందాలని ఆకాంక్షించారు. అవార్డుకు గ్రహీత మాట్లాడుతూ దేశసేవే తన లక్ష్యమని సమాజ శ్రేయస్సు కోసం సంస్థ ఆధ్వర్యంలో అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. ఇందులో భాగంగా సంతోష్ బాబు విగ్రహాన్ని కోదాడలో(Kodada) ఏర్పాటుచేసి ఏడాది అయిన సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ జిల్లా ఇన్చార్జి జగనీ(Vasavi Club District Incharge Jagani). ప్రసాద్, ఐ వి ఓ పిఆర్వో ఎస్.రమేష్ వాసవి యూత్ క్లబ్ అధ్యక్షులు అనంత చక్రవర్తి, జనరల్ సెక్రటరీ భరత్ చంద్ర, సతీష్ కుమార్, యాద కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Desa ratna award goes to madhusudan rao