*అధికారులు కేటాయించిన ఘాటుల వద్ద మాత్రమే నిమజ్జనాలు చేయాలి. జిల్లా ఎస్పీ
Ganesh immersion: ప్రజా దీవెన, కోదాడ: గణేష్ నిమజ్జన ఉత్సవాలను (Ganesh immersion) ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవ కమిటీ వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ (Sun preeth Singh) ఐపీఎస్ అన్నారు. శనివారం కోదాడ (kodad) పట్టణంలోని పెద్ద చెరువు (Big Pond) వద్ద ఏర్పాటుచేసిన నిమజ్జన స్థలాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్న ఉత్సవ కమిటీ వారు నిమజ్జన సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని అన్నారు.
నిమజ్జన ఊరేగింపు సమయంలో డిజే (DJ Sound Systems)లు పెట్టరాదు. ఘాటుల వద్దకు వెళ్లేటప్పుడు చిన్న పిల్లలను తీసుకొని వెళ్లొద్దని అన్నారు. ఊరేగింపు సమయంలో ట్రాఫిక్ కి అంతరాయం లేకుండా పోలీసు వారికి సహకరించాలని అన్నారు. పోటీతత్వం లేకుండా ఒకరి తర్వాత ఒకరు ఊరేగింపులు జరుపుకోవాలని అన్నారు. అధికారులు చూయించిన ఘాటుల వద్దనే నిమజ్జనాలు జరుపుకోవాలని తెలిపారు.
ఎవరు కూడా ఉత్సాహంతో తెలియని ప్రాంతాలకు వెళ్లి నిమజ్జనాలు చేయరాదని తెలిపారు. అనంతరం కోదాడలో పెద్ద చెరువు వద్ద ఏర్పాటుచేసిన నిమజ్జన ఘాటు(immersion Ghat) ను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి శ్రీధర్ రెడ్డి, ఆర్డిఓ సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ రమాదేవి, సిఐ రాము, పోలీస్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.