Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Jagadeesh reddy: రేవంత్ వి రోత వ్యాఖ్యలు: జగదీష్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భువన గిరి ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలపై మాజీమంత్రి, సూర్యా పేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అదే స్ధాయిలో కౌంటర్ ఎటాక్ చేశారు.

ప్రజా దీవెన, సూర్యాపేట: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth reddy)భువన గిరి ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలపై మాజీమంత్రి, సూర్యా పేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అదే స్ధాయిలో కౌంటర్ ఎటాక్ చేశారు. నాపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు రోత గా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

ఆయన పేరు రేవంత్ రెడ్డి కాదు రోతంత రెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి మీడి యాతో మాట్లాడారు. సీఎం హోదా లో రేవంత్ మాట్లాడిన తీరు బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో(election campaign) సీఎం రేవంత్ ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు మాటలు ఆయనలోని ఓటమి భయం స్పష్టంగా కనబరుస్తోందని అన్నారు. బ్లాక్ మెయిలింగ్ పాలి టిక్స్ కు కాంగ్రెస్ పార్టీ కేరాఫ్ అడ్రస్ అని విమర్శించారు.రేవంత్ ముఖ్య మంత్రి పదవి కి వాళ్ళ నేతలే త్వరలో ఎసరు పెడతారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ 160 రోజుల పాలనలో కరువు వచ్చిందని, లక్షల ఎకరాల పంటలు ఎండిపోయాయ ని, మహిళలు బిందె పట్టుకుని మ ళ్ళీ రోడ్డెక్కి పరిస్థితి దాపురించిం దని ఆందోళన వ్యక్తం చేశారు.

తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీకి(modi) డబ్బు సంచులు పంపిస్తున్నాడని ఆరోపించారు. ప్రధాని మోదీ తన సీఎం పీఠాన్ని కాపాడుతాడన్న కలలు కంటున్నా డని ఎద్దేవా చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ను రేవంత్ రెడ్డి పొగుడు తుంటే ప్రజలే కాదు కాంగ్రెస్ నేతలు కూడా నవ్వుకుంటున్నారని ఆన్నా రు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు అద్దంకి దయాకర్,కొండేటి మల్ల య్య లాంటి వాళ్ళను దూరం పెట్టి భూతులు తిట్టించుకున్న బ్రదర్స్ ను వెనకేసుకు రావడం లో ఆ0తర్య మేమిటో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Jagadeesh reddy counter on Revanth reddy speech