Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గలలో అత్యధిక మెజారిటీ వస్తది:ఉత్తమ్

ప్రజా దీవెన, కోదాడ: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసినారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నీటిపారుదల @ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,స్థానిక శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి,తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు,ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ (tinmar mallanna)మల్లన్న,మాజీ ఎమ్మెల్యే చందర్ రావులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(uttam kumar reddy)మాట్లాడుతూ మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలోనే కోదాడ,హుజూర్ నగర్ నియోజకవర్గాలు పార్టీ అభ్యర్థి కి అత్యధిక మెజార్టీని అందిస్తాయని అదేవిధంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు అదే మెజార్టీ ఇస్తామని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ విజయ పరంపర కొనసాగుతుందని ఆయన అన్నారు.

రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రతి ఒక్కరూ వారి వారి గ్రామాలలో ప్రణాళిక ఏర్పాటు చేసుకొని గ్రాడ్యుయేట్స్ ని కలిసి మొదటి ప్రాధాన్యత ఓటును తీన్మార్ మల్లన్నకు వేయించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.అనంతరం ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గంలో గ్రాడ్యుయేట్ ఎన్నికలలో అత్యధిక మెజార్టీ తీసుకురావడానికి ప్రతి ఒక్కరం కృషి చేస్తున్నామని అన్నారు.రిటైర్డ్ ఉద్యోగ సంఘాలను,బార్ అసోసియేషన్ సంఘాలను,వాకర్స్ సంఘాలను,వివిధ సంఘాలను కలుపుకుంటూ ఎమ్మెల్సీ ఎన్నికలలో అత్యధిక మెజారిటీ తీసుకొస్తామని అన్నారు.

అనంతరం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు మాట్లాడుతూ కెసిఆర్ సర్కార్ ని ఎదిరించి నిలబడిన వ్యక్తి,కేసీఆర్ పాలనలో 116 రోజులు జైలు జీవితాన్ని గడిపిన వ్యక్తి తీన్మార్ మల్లన్న అని అన్నారు.వీరుల్ని కన్న జిల్లా విప్లవాల జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మల్లన్నకు అత్యధిక మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.అనంతరం కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పది కాలాలపాటు చల్లంగా ఉంటాదని కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని అన్నారు.కోదాడను,హుజూర్ నగర్ ను ఢిల్లీ స్థాయిలో మంచి పేరు తీసుకొస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి,ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

ఇప్పుడు ఈ ఎన్నికలలో నాకు ప్రత్యర్థులుగా నిలబడిన వ్యక్తులు ఒకరు భారత మరాజ్యాంగాన్ని రద్దు చేస్తాం 400 సీట్లు మేమే గెలుస్తాం అని చెప్పుకుంటున్న నరేంద్ర మోడీ క్యాండిడేట్ ఒకరు,తెలంగాణ రాష్ట్రంలో తుగ్లకు పరిపాలన చేసి ప్రజల,గ్రాడ్యుయేట్ జీవితాలతో చెలగాటము ఆడిన కేసీఆర్ క్యాండిడేట్ మరి ఒకరు కావున ఎమ్మెల్సీ ఎన్నికలలో తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించినట్లయితే గ్రాడ్యుయేట్ పక్షాన ప్రశ్నించే గొంతుగా పనిచేస్తాన ని అన్నారు.సోనియా గాంధీ పంపించిన వ్యక్తి తీన్మార్ మల్లన్న అని అన్నారు.కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని ఇప్పటికే 35 వేల ఉద్యోగాలు నింపి గ్రాడ్యుయేట్స్ పక్షాన నిలబడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.సిపిఐ,సిపిఎం అభ్యర్థులతో కలిసి ఈ ఎన్నికలలో పనిచేస్తున్నామని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్,పీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి,మున్సిపల్ చైర్పర్సన్ సామినేని ప్రమీల రమేష్,పట్టణ అధ్యక్షులు వంగవీటి రామారావు,పార సీతయ్య,ఎంపీపీలు మల్లెల రాణి బ్రహ్మయ్య,చుండూరు వెంకటేశ్వరరావు,యాతాకుల జ్యోతి మధుబాబు,ఆశ శ్రీకాంత్ రెడ్డి,జెడ్పిటిసిలు మందలపు కృష్ణకుమారి శేషు,నల్లపాటి శ్రీనివాసరావు,కొణతం ఉమా శ్రీనివాసరెడ్డి,సిలువేరు వెంకటేశ్వర్లు నాగేంద్రబాబు,ముస్కు శ్రీనివాసరెడ్డి,కీత వెంకటేశ్వర్లు తిరుపతయ్య బాగ్దాద్ , తదితరలు పాల్గొన్నారు.

largest majority in Huzur Nagar and kodad constituencies