Muthuvarapu Panduranga Rao: ప్రజా దీవెన, కోదాడ: గణేష్ నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా భక్తులకు అన్నదానాలు నిర్వహించడం అభినందనీయమని మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తువరపు పాండురంగారావు (Muthuvarapu Panduranga Rao) అన్నారు. శనివారం కోదాడ (kodad) పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్ 17వ వార్డులో బత్తినేని హనుమంతరావు ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు (Ganesh Chaturthi celebrations) ఘనంగా నిర్వహిస్తున్నారు.
శనివారం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని (Annadhana programme) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆయన పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బత్తినేని హనుమంతరావు, భూసాని మల్లారెడ్డి, హరి ప్రసాద్,కేతిరెడ్డి, సత్యనారాయణరెడ్డి, శ్రీనివాసరావు, మల్లికార్జున్, వీరారెడ్డి,శ్రీనివాసరెడ్డి,వల్లూరి సుబ్బారావు, అఖిల్, పత్తిపాక కృష్ణ, పవన్ రెడ్డి, అజయ్, సాయి, మాధవరావు, ఉప్పగండ్ల శ్రీను, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.