Funeral: మానవత్వం చాటి అభాగ్యుని మృతదేహానికి అంత్యక్రియలు
మండల పరిధిలోని దొరకుంట గ్రామంలో ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న పిడుగు వెంకటరెడ్డి అనారోగ్యంతో మృతి చెందాడు.
ప్రజా దీవెన,కోదాడ: మండల పరిధిలోని దొరకుంట గ్రామంలో ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న పిడుగు వెంకటరెడ్డి అనారోగ్యంతో మృతి చెందాడు. దహన సంస్కారాలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో విషయం తెలుసుకొని అభాగ్యుని అంతక్రియలు నిర్వహించేందుకు దొరకుంట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ(Congress party leaders) సీనియర్ నాయకులు చౌడం హనుమంతరావు(Chaudam Hanumantha Rao) మానవత్వాన్ని చాటుకొని అంత్యక్రియల నిమిత్తం శ్రీరామ్ ఫౌండేషన్(Sriram Foundation) ఆధ్వర్యంలో 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసి దగ్గరుండి దహన సంస్కారాలను నిర్వహించారు. మానవత్వం కనుమరుగవుతున్న ఈ రోజుల్లో హనుమంతరావు చేసిన సామాజిక సేవను పలువురు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పత్తిపాక.వెంకటేశ్వర్లు,సీనియర నాయకులు భీమాల.బ్రహ్మం, సోందు తదితరులు పాల్గొన్నారు.
Poor person dead body funeral