Engineering womens college: ఆరోపణలు అవాస్తవం
కోదాడ కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలపై ఇటీవల వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని కళాశాల చైర్మన్ డాక్టర్ నీలా సత్యనారాయణ అన్నారు.
గ్రామీణ ప్రాంత విద్యార్థినులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాo
కళాశాల చైర్మన్ డాక్టర్ నీలా సత్యనారాయణ
ప్రజా దీవెన, కోదాడ: కోదాడ కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలపై(Engineering womens college)ఇటీవల వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని కళాశాల చైర్మన్ డాక్టర్ నీలా సత్యనారాయణ అన్నారు. ఆదివారం కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడు తూ తమ కళాశాల స్థాపించిన నాటి నుండి నేటి వరకు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా ఉన్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన సాంకేతిక విద్యను అందిస్తుమని తెలిపారు.
కళాశాల ఆవిర్భావం నాటినుండి నేటి వరకు వేలాది మంది విద్యా ర్థినులు(Girls students) లు ఉన్నత స్థానాలకు ఎదిగారు అన్నారు.ప్రతి ఏడాది ఇంజనీరింగ్ కోర్స్ ల(Engineering course)ప్రవేశాల సమయంలో కళాశాలపై పనిగ ట్టుకుని చేస్తున్న దుష్ప్రచారాలను ఆయన ఖండించారు.వ్యక్తిగత కారణాలతో విద్యాసంస్థ పై దుష్ప్రచారం చేసి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడ వద్దని విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు(Parents) వాస్తవ విషయాలను గ్రహించాలని కోరారు.గ్రామీణ ప్రాంత పేద మధ్యతరగతి విద్యార్థినులకు లకు న్యాయమైన విద్యను అందిచటమే విద్యాసంస్థ లక్ష్యం అన్నారు.
విద్యాసంస్థను ఆదరించి విద్యా భివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు.తమ వ్యక్తిగత కక్షలతో కళాశాలలో చదువుతున్న విద్యార్థినుల భవిష్యత్తుకు ఆటంకం కలిగించవద్దని వేడుకుంటున్నారు
తన నుండి నష్టపోయినాం అని భావించిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వారితో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. సమాజంలో నాకున్న గౌరవాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో నాపై, కళాశాలపై దుష్ప్రచారాన్ని చేస్తున్నారని ఆరోపించారు.
Providing quality education to rural girls