Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MLA Padmavathi Reddy: రఘువీర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి

నల్లగొండ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రఘు వీర్ రెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు.

ప్రజాదీవెన, కోదాడ: నల్లగొండ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రఘు వీర్ రెడ్డి(Raghuveer reddy ) ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి(MLA Padmavathi reddy) అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో రఘువీర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ లారీ అసోసియేషన్ నాయకులు ముద్రించిన గోడపత్రికలను ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. లారీ యజమానుల అసోసియేషన్ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు తెలపడం పట్ల సంతోషకరమని తెలిపారు. లారీ యజమానులకు కాంగ్రెస్ పార్టీ(congress party manifesto) మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని నెరవేచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోదాడ అసోసియేషన్ అధ్యక్షులు కనగాల.నాగేశ్వరరావు, రాష్ట్ర అసోసియేషన్ చైర్మన్ రామినేని. శ్రీనివాసరావు,జిల్లా గౌరవ అధ్యక్షులు పైడిమర్రి. వెంకటనారాయణ, తునం. కృష్ణ, విలాసకవీ.నరసరాజు,యలమందల. నరసయ్య, నరసింహారావు గౌసిద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Raghuveer reddy win says by Padmavathi