Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Sagar Canal: సాగర్ కాలువ గండిని తక్షణమే పూడ్చి పంటలను కాపాడాలి

Sagar Canal: ప్రజా దీవెన, కోదాడ: నడిగూడెం మండలం కాగితరామచంద్రాపురం వద్ద సాగర్ కాలువ(Sagar Canal)కు పడిన గండిని వెంటనే పూడ్చి సాగు చేస్తున్న పంటలను కాపాడాలని తెలుగు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తోడు వచ్చిన వరదలతో సాగర్ కాలువకు పడిన గండిని పూడ్చడంలో తాత్సారం చేస్తూ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తున్నదని విమర్శించారు. ఈ గండిని పుడ్చకపోవడం వల్ల మునగాల (Munagala) నుండి నాయకన్ గూడెం (Nayakan Gudem) వరకు సాగర్ కాలువ కింద వేలాది ఎకరాల్లో సాగు చేసిన పంటలు ఎండి పోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్రక్క ప్రభుత్వం నుండి రైతు బంధు (raithu bandhu), రైతు రుణమాఫీ (Raithu runamafi) సహాయం అందక, మరోప్రక్క వానలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగానికి తక్షణమే గండిని పూడ్చి సాగర్ నీళ్లు అందించక పోతే ఆత్మహత్యలే శరణ్యమని చెప్పారు. కనుక తక్షణమే గండి పూడ్చివేత పనులను ప్రారంభించి రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గండి పూడ్చివేత పనులను వెంటనే ప్రారంభించని పక్షంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ గండి పూడ్చివేత పనులు మొదలు పెట్టేంత వరకు రైతుల పక్షాన నడిగూడెం మండల కేంద్రంలో నిరవధిక నిరాహార దీక్ష (strike) చేపడతానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.