Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Sheikh Nayeema: అక్రమ అరెస్టులు ప్రజాస్వామ్యానికి విరుద్ధం.

* రాత్రి నుంచి స్టేషన్లో కూర్చోబెట్టడం దారుణం షేక్ నయీమ.

Sheikh Nayeema: ప్రజా దీవెన, కోదాడ: అక్రమ అరెస్టులు ప్రజాస్వామ్యాని(democracy)కి విరుద్ధమని కోదాడ బిఆర్ఎస్ పార్టీ (BRS Party) పట్టణ అధ్యక్షులు షేక్ నయీమ్ అన్నారు.శుక్రవారం కోదాడ పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం (Telangana Talli statue) వద్ద అక్రమ అరెస్టులకు నిరసనగా నాయకులతో కలిసి నిరసన తెలిపి మాట్లాడారు. బిఆర్ఎస్ నాయకులను ఎటువంటి సమాచారం లేకుండా నిన్న రాత్రి నుంచి పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో (police station) నిర్బంధించి ఇబ్బందులకు గురి చేశారని రాత్రంతా దోమలతో తిండి తిప్పలు లేకుండా గడిపామని గుండె జబ్బులతో బాధపడుతున్నామని చెప్పిన వినకుండా పోలీసులు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారని పోలీసుల తీరును వారు తీవ్రంగా ఖండించారు.

ప్రజాస్వామ్యంలో నిరసనలు, బంద్ లు చేసుకునే హక్కు ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులు అండతో నియంత పాలన చేస్తుందన్నారు. ప్రజల స్వేచ్ఛను హరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి గట్ల కోటేశ్వరరావు, కర్ల సుందర్ బాబు, పిట్టల భాగ్యమ్మ, చలిగంటి వెంకట్, అబ్బు, అభిధర్ నాయుడు, దొంగరి శ్రీను, ఇమ్రాన్, నిస్సార్ తదితరులు పాల్గొన్నారు.