Student: విద్యార్థులు సబ్జెక్టు పై అవగాహన పెంచుకోవాలి
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యా ర్థులు సంబంధించిన సబ్జెక్టులపై అవగాహన పెంపొందించుకొని మంచి విజయాలు సాధించాలని కుర్రి నాగరాజు అన్నారు.
ప్రజా దీవెన, కోదాడ: పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యా ర్థులు సంబంధించిన సబ్జెక్టులపై అవగాహన పెంపొందించుకొని మంచి విజయాలు సాధించాలని కుర్రి నాగరాజు అన్నారు. శుక్రవారం పట్టణంలోని స్థానిక మండల సహ కారం కళాశాలలో అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీఎస్ ఆర్ జె సి పాలిసెట్ ఉచిత శిక్షణ కేంద్రాల్లో విద్యార్థులకు మెటీరియల్ ను పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా నాగ రాజు మాట్లాడుతూ తన తండ్రి సీతారా ములు జ్ఞాపకార్థం పేద విద్యా ర్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేయటం అదృష్టంగా భావిస్తున్నా మని తెలిపారు.
విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధించాలంటే సబ్జెక్టు పై అవగాహన పెంచుకోవ డంతో పాటు ఎప్పటికప్పుడు పరీక్షల ద్వారా వారి తెలివిని అంచనా వేసుకుంటూ దానికి అనుగుణంగా కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని అంబేద్కర్ ఆశయ సాధన వారు ఉచితంగా కోచింగ్ ఇవ్వడం అభినందనీయమని ఈ అవకాశాన్ని నియోజకవర్గ పరిధిలో ఉన్న విద్యార్థినీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆస్కా అధ్యక్షులు బల్గూరి స్నేహ దుర్గయ్య ఆస్క్ ప్రధాన కార్యదర్శి మాతంగి ప్రభాకర్ కోర్స్ కోఆర్డినేటర్ గంధం బుచ్చిరావు ఫ్యాకల్టీ చెరుకుపల్లి కిరణ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Student more learn on subject