Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Suryapet : ఉత్తరప్రదేశ్ ఎన్నికల బరిలో సూర్యాపేట బిడ్డ

ఒకప్పుడు రాజకీయాలంటేనే పురుషుల ఆదిపత్యం ఉండేది. కానీ ఇప్పుడు మహిళలు.. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో పోటీ పడుతున్నారు. ముఖ్యంగా రాజకీయాల్లో కూడా నారీ శక్తిని చాటుతున్నారు.

ఎంపీగా పోటీలో ఉన్న శ్రీకళారెడ్డిది రాజకీయ కుటుంబం
నడిగూడెం మండలం రత్నవరం గ్రామం ఆమె స్వగ్రామం

ప్రజాదీవెన, నల్లగొండ బ్యూరో: ఒకప్పుడు రాజకీయాలంటేనే పురుషుల ఆదిపత్యం ఉండేది. కానీ ఇప్పుడు మహిళలు.. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో పోటీ పడుతున్నారు. ముఖ్యంగా రాజకీయాల్లో కూడా నారీ శక్తిని చాటుతున్నారు. తెలుగింటి ఆడపడుచులు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తర భారత దేశంలోని ఎన్నికల్లో కూడా పోటీపడుతున్నారు. గతంలో సినీ నటి జయప్రద ఉత్తరప్రదేశ్(Uttar pradesh) నుంచి ఎంపీగా గెలిచి రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు.

తాజాగా తెలంగాణ ఆడపడుచు కూడా ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీగా ఎన్నికల బరిలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేస్తున్న తెలంగాణ పడుచు ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. దేశవ్యాప్తంగా జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో(parliament elections) పురుషులతో పాటు మహిళలు కూడా బరిలో ఉన్నారు. ఎన్నికల్లో తమ అదృష్టాన్ని మహిళలు పరీక్షించుకుంటున్నారు. సూర్యాపేట (suryapet)జిల్లాకు చెందిన తెలంగాణ ఆడపడుచు ఉత్తర ప్రదేశ్ నుంచి ఎంపీ ఎన్నికల బరిలో నిలిచారు. యూపీలోని జౌన్‌పుర్ లోక్‌సభ స్థానం నుంచి శ్రీకళారెడ్డి పోటీ చేస్తున్నారు. ఆమెకు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తరపున ఎన్నికల బరిలో పోటీ చేస్తున్నారు.

తెలంగాణ ఆడపడుచు అయిన శ్రీ కళా రెడ్డి(Sri kala reddy) మెట్టినింటి నుంచి పలమట్టి ఎన్నికల బరిలో ఉన్నారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరం గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కీసర జితేందర్ రెడ్డి కుమార్తె శ్రీ కళా రెడ్డి. 1972 లో హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా కీసర జితేందర్ రెడ్డి గెలిచారు. చెన్నైలోనీ నిప్పు బ్యాటరీ ఇండస్ట్రీస్ అధినేత జితేందర్ రెడ్డి. శ్రీకళా రెడ్డి అమెరికాలో ఆర్కిటెక్చర్‌ ఇంటీరియర్‌ డిజైనింగ్‌ కోర్సు చేశారు. రాజకీయ కుటుంబ నేపథ్యం కలిగిన శ్రీ కళా రెడ్డికి సామాజిక సేవా రాజకీయాలపై ఆసక్తి ఉండేది. దీంతో 2004లో టిడిపిలో చేరి కోదాడ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఆ తర్వాత బిజెపి, వైఎస్ఆర్సిపి నుంచి కూడా టికెట్ ఆశించారు.

Suryapet daughter contest in uttar pradesh elections