Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Techno Paste Celebrations: కిడ్స్ లోజాతీయస్థాయిలో టెక్నో పేస్ట్ వేడుకలు

కోదాడ పట్టణములోని స్థానిక కిడ్స్ మహి ళాఇంజనీరింగ్ కళాశాలలో జాతీయస్థాయిలో టెక్నో పేస్ట్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తు న్నట్లు కళాశాల ప్రిన్సిపల్ పి గాంధీ తెలిపారు

ప్రజా దీవెన, కోదాడ: కోదాడ పట్టణములోని స్థానిక కిడ్స్ మహి ళాఇంజనీరింగ్ కళాశాలలో జాతీయస్థాయిలో టెక్నో పేస్ట్ వేడుకలను(Techno Paste Celebrations) ఘనంగా నిర్వహిస్తు న్నట్లు కళాశాల ప్రిన్సిపల్ పి గాంధీ తెలిపారు ఈ సందర్భంగా కళాశాల అకాడమిక్ అడ్వైజర్ పోతుగంటి నాగేశ్వరరావు కళాశాల డైరెక్టర్ నాగార్జున రావు మాట్లాడుతూ తమ కళాశాలలో రెండు రోజులు మే రెండవ తారీకు మూడో తారీ కులలో ఏడవ జాతీయ స్థాయిలో 24 టెక్నో పేస్ట్ వేడుక లను నిర్వ హిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్య క్రమానికి తెలుగు రాష్ట్రాల నుండి కళాశాల విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించాలని ఆయన తెలిపారు. మొదటి రోజు పేపర్ ప్రజెంటేషన్ టెక్నికల్ క్విజ్ పోస్టర్ ప్రజెంటేషన్ ప్రదర్శించవచ్చు అని తెలిపారు. రెండవ రోజు కళాశాల విద్యార్థులకు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయని తెలిపారు.

ఈ కార్య క్రమానికి ముఖ్యఅతిథిగా జేఎన్టీ యూ(JNTU) జగిత్యాల ప్రొఫెసర్ డాక్టర్ సురేష్ కుమార్ పాల్గొంటారని రాష్ట్ర నలుమూలల్లో ఉన్న కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొని టెక్నో పేస్ట్ కార్యక్రమాన్ని విజ యవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టెక్నో పేస్ట్ కన్వీ నర్ డాక్టర్ ఎం డి నరేష్ రెడ్డి మరియు వివిధ రమేష్ స్రవంతి జనార్ధన్ ఏవో కృష్ణారావు అధ్యా పకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Techno Paste Celebrations in Kids national Level