Toll Plaza: అర్ధరాత్రి నుంచే ‘టోల్ ‘ పెంపు
టోల్ ప్లాజాల వద్ద వాహనదారుల నుంచి వసూలు చేసే టోల్ ఫీజు ధరల పెం పునకు రంగం సిద్ధమైంది. ఆనవా యితీగా ప్రతీ ఏడాది ఏప్రిల్ 1 నుంచి టోల్ ధరలు 5 శాతం పెంచు తుంటారు.
లోక్ సభ ఎన్నికలు పూర్తవ్వగానే
టోల్ ఫీజు లు పెంచారు
టోల్ యూజర్ చార్జీ కింద రూ.3 పెంపుకు రంగం సిద్ధం
ప్రజా దీవెన సూర్యాపేట: టోల్ ప్లాజాల (Toll plaza)వద్ద వాహనదారుల నుంచి వసూలు చేసే టోల్ ఫీజు ధరల పెం పునకు రంగం సిద్ధమైంది. ఆనవా యితీగా ప్రతీ ఏడాది ఏప్రిల్ 1 నుంచి టోల్ ధరలు 5 శాతం పెంచు తుంటారు. లోక్‌సభ ఎన్నికల(Lok Sabha elections) నేప థ్యంలో ధరల పెంపు ఈ సారి తాత్కాలికంగా నిలిచిపోయింది. దేశ వ్యాప్తంగా ఎన్నికలు పూర్తవ్వ డంతో ఈ నెల మూడో తేదీ ఆదివా రం అర్ధరాత్రి నుంచి పెంచిన టోల్ ధరలు అమలులోకి రానున్నాయి. రాష్ట్రంలోని 65వ నెంబరు జాతీయ రహదారిపై తెలంగాణ, ఏపీ రాష్ట్రా ల్లో జీఎంఆర్ సంస్థ ఏర్పాటు చేసిన టోల్‌ప్లాజాల్లో టోల్ చార్జీలను ఆది వారం అర్ధరాత్రి తర్వాత నుంచి పెంచుతున్నారు. హైదరాబాద్– విజయవాడ(Hyderabad – Vijayawada) మార్గంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్, ఏపీ లోని చిల్లకల్లు వద్ద టోల్‌ప్లాజాలను జీఎంఆర్ ఏర్పాటు చేసింది.
టోల్ చార్జీల పెంపును జూన్ 3 వ తేదీ సోమవారం ఉదయం నుంచి అమ లు చేస్తున్నామని కొర్లపహాడ్ టోల్ ప్లాజా నిర్వాహకులు తెలిపారు. వాహనాల సామర్థ్యం ఆధారంగా ఒక్కో వాహనానికి ఒకవైపు, ఇరు వైపులా ప్రయాణానికి కలిపి కనిష్ఠం గా రూ.5 నుంచి గరిష్ఠంగా రూ.40 మేర చార్జీలు పెరిగాయి. అలాగే. టోల్‌ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధి లోని గ్రామాలకు చెందిన స్థానిక వాహనాల నెలవారీ పాసు ధరను రూ.330 నుంచి రూ.340కి పెంచా రు. ఇక,పెరిగిన టోల్ ఫీజుల భారా న్ని ఆర్టీసీ ప్రయాణికులపైనే వేస్తోం ది. ఆర్టీసీకి చెందిన వివిధ సర్వీసు ల్లో ప్రయాణించే ఒక్కో ప్రయాణికు డిపై రూ.3 అదనపు భారం పడనుంది. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యం సవరించిన చార్జీలతో సర్క్యులర్‌ను శుక్ర వారమే జారీ చేసింది.పంతంగి టోల్‌ప్లాజా వద్ద జూన్ 2 నుంచి పెరగనున్న టోల్‌ఫీజులు వాహనం పేరు సింగల్ జర్నీ రిటర్న్ జర్నీ నెలవారీ
కారు, జీపు, వ్యాన్ లేదా లైట్ మోటర్ వాహనం 90–95 135–145 2965–3200
లైట్ కమర్షియల్, లైట్ గూడ్స్ వాహనాలు 140–150 210– 230 4685– 5055
బస్ లేదా ట్రక్ 290– 315 435– 470 9685–10455
హెవీ కన్‌స్ట్రక్షన్, ఎర్త్ మూవింగ్ వాహనాలు 450–485 675–725 14970–16155
పెద్ద వాహనాలు 560–605 845–910 18740–20225
కొర్లపహాడ్ టోల్‌ప్లాజా వద్ద
కారు, జీపు, వ్యాన్, లైట్ మోటార్ వాహనాలు 125–130 190–195 4225–4335
లైట్ వాణిజ్య, లైట్ వస్తువాహనాలు, మినీ బస్సు 190–195 300–310 6710–6880
బస్సు లేక ట్రక్కు, (రెండు యాక్సిల్స్) 415–430 625–640 13,910–14,265
భారీ నిర్మాణ,మల్టీయాక్సిల్ వాహనాలు 645 –665 970–995 21,570– 22,120
భారీ పరిమాణ వాహనాలు 805– 825 1210–1240 26,840–27,525
Toll fees increased after Lok Sabha elections