Huzurabad KCR road show:కోతిచేష్టల కాంగ్రెస్ ప్రభుత్వం కొసేల్లదు
తెలంగాణ పరిస్థితిని చూస్తే దుఃఖం కలుగుతోందని, కాంగ్రెస్ పార్టీ ప్రభు త్వం కొస వెళ్లదని, మళ్లీ బి ఆర్ ఎస్ ప్రభుత్వమే వస్తుందని మాజీ ముఖ్యమంత్రి బి.ఆర్.ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నా రు.
తెలంగాణ ప్రజలను చూస్తే కడుపు తరుక్కుపోతోంది
మళ్ళీ రాష్ట్రంలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం వస్తుందని భరోసా
హుజురాబాద్ ఎన్నికల ప్రచారం లో బిఆర్ఎస్ అధినేత కెసిఆర్
ప్రజా దీవెన, హుజూరాబాద్: తెలంగాణ పరిస్థితిని చూస్తే దుఃఖం కలుగుతోందని, కాంగ్రెస్ పార్టీ ప్రభు త్వం కొస వెళ్లదని, మళ్లీ బి ఆర్ ఎస్(BRS) ప్రభుత్వమే వస్తుందని మాజీ ముఖ్యమంత్రి బి.ఆర్.ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు(Kalvakuntla Chandrasekhara Rao) అన్నా రు. శనివారం రాత్రి హుజూరాబాద్ నియోజకవర్గం లోని వీణవంక మం డల కేంద్రానికి చేరుకున్న కేసిఆర్ కు ప్రజలు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలి కారు. రాత్రి కౌశిక్ ఇంట్లో బసచేసిన కెసిఆర్ ఆదివారం మధ్యాహ్నం జరి గిన ఆత్మీయ సమ్మేళన సభకు హాజ రయ్యారు.
ఈ సభకు బిఆర్ఎస్ ఎంపి అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కవి గాయకుడు దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ రావు, ఎర్రోళ్ల శ్రీనివాస్, జీవి రామ కృష్ణారావు తదితరులు హాజర య్యారు. ఈ సందర్భంగా కెసిఆర్(KCR) మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టాల్సిన ఐటి, ఇతర పరిశ్రమలు వేరే రాష్ట్రా లకు తరలిపోతున్నాయని, ఇటీవలే ఓ ఐటీ కంపెనీ చెన్నైకి తరలిపో యిందని, అల్యూమినియం ప్లాస్టిక్ పరిశ్రమలకు విద్యుత్ కోతలు విధిస్తున్నారని, రైతులకు రైతుబం ధు అందడం లేదని, విద్యుత్తు కొరతలనుకుంటున్నాయని, రాష్ట్ర పరిస్థితిని చూస్తే దుఃఖం కలుగు తోందని, అభివృద్ధి సంక్షేమ కార్య క్రమాలు ఎక్కడికక్కడ నిలిచి పోయాయి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో 9 ఏళ్ళు రైతులకు పరిశ్రమలకు గృహ అవస రాలకు సరిపోయినంత కరెంటు ఇచ్చామని, కానీ నాలుగు నెలల్లోనే ఏమైందని విద్యుత్(electricity) పోతను ఎం దుకు వచ్చాయని ఆయన ప్రశ్నిం చారు. మిషన్ కాకతీయ ద్వారా తాగునీరు సరఫరా కావడం లేదని, ఎంజీఎం ఆసుపత్రిలో, ఆదిలాబాద్ రిమ్స్ లో రోగులకు సేవలు అందక ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయన్నట్లు పత్రికల్లో వార్త లు చదివానని కెసిఆర్ అన్నారు. తమ పాలనలో ప్రభుత్వ ఆసుప త్రుల్లో ప్రసవాలు చేశామని, ఆడపిల్ల పుడితే రూ.13000, మగ శిశువు పుడితే రూ. 12000 ఇచ్చామని, కెసిఆర్ కిట్లు అందజేశామని, తల్లిని శిశువును వాహనంలో తీసుకువచ్చి ప్రసవం చేసి తిరిగి ఇంటి వద్ద దింపామని, ప్రైవేటు ఆసుపత్రుల్లో దోపిడీని తమ ప్రైవేటు ఆసుపత్రుల్లో దోపిడీని తాము అరికట్టామని అన్నారు.
రాష్ట్రాన్ని కాపాడే దక్షత, ప్రజలను కాపాడాలనే తాపత్రయం కాంగ్రెస్(Congress) ప్రభుత్వానికి లేదని ఆయన విమర్శించారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ గోదావరి, కృష్ణా జలాలను తమిళనాడు కర్ణాటకకు తీసుకుపోయే ప్రయత్నం అధికారికంగా చేస్తున్నారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయమే స్పందించడం లేదని, ఇలాంటి చర్యలను బి ఆర్ ఎస్ ప్రభుత్వ పాలన సమయంలో చేస్తే తాను గట్టిగా అడ్డుకున్నానని ఆయన అన్నారు. గోదావరి, కృష్ణ జలాలు వేరే రాష్ట్రాలకు తీసుకువెళ్తే తెలంగాణకు, రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ విషయమై ఎన్నోసార్లు తనను సమావేశాలకు తెలిసిన తను వెళ్లలేదని, ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పానని.. ఆయన వెల్లడించారు.
ఇలాంటి సందర్భాల్లో పార్లమెంటులో(Parliament) మనకు ఎంపీల బలం ఉంటే ఎగిరి మైకు అందుకొని కేంద్రాన్ని ప్రశ్నించే అవకాశం ఉంటుందని.. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో బి.ఆర్.ఎస్ ఎంపీలను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. బండి సంజయ్(Bandi Sanjay)మైకు దొరికితే తిట్ల పురాణాలు.. తంబాకు తినడం కోసం చేసింది ఏమీ లేదని మండిపడ్డారు. తెలం గాణ కొత్త రాష్ట్రం ఏర్పడినాటికి కరెంటు ఉండేది కాదని, నీళ్లు ఉండేవి కాదని, తెలంగాణ రైతులు ఇతర రాష్ట్రాలకు కూలీలుగా వలస వెళ్లే పరిస్థితి ఉండేదని, కొందరు రైతులు ఆటో డ్రైవర్లుగా మారారని గుర్తు చేశారు.
అలాంటి తెలం గాణను ఒక పాదరిల్లుల నిర్మాణం చేసుకున్నామని ఆసరా పింఛ న్లను 200 నుండి వెయ్యికి 1000 నుండి 2000 పెంచుకున్నామని అశోక్ గులాటి, చరణ్ దాస్ వంటి మేధావులతో చర్చించి వ్యవసా యాన్ని స్థిరీకరణ చేసేందుకు రైతు బంధు రైతు బీమా ధరణి(Dharan) వెబ్సైట్ తీసుకువచ్చామని, కాలువల ద్వారా ఏడాదికి 10 నెలల పాటు రైతులు ఇక చాలు అనేదాకా నీటి సరఫరా చేసామని, రైతులకు ఇబ్బంది కలగకుండా తేమ తరుగు లేకుండా చివరకు రైతులకు నష్టం జరగకుండా తడిసిన ధాన్యాన్ని కూడా 7500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి రా కొనుగోలు చేశామని ఆయన గుర్తు చేశారు.
55 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి మొదట రాష్ట్రంలో ఉండేదని, దాన్ని 3.5 లక్షల టన్నులకు తీసు కువెళ్లామని వలస పోయిన రైతు లు మళ్లీ రాష్ట్రానికి వచ్చి వ్యవ సాయం చేసుకున్నారని, రైతుల ధైర్యం విశ్వాసం కల్పించామని అన్నారు. హుజరాబాద్ లో దళిత బందును పైలట్ ప్రాజెక్టుగా తీసు కున్నామని, దళితులు ఆత్మగౌ రవంతో తలెత్తుకొని తిరిగేలా చేసామని, దీన్ని పొడిగించాలని ప్రయత్నం చేశామని కానీ తమ ప్రభుత్వం గెలవలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలతో చేసిన ప్రచారాన్ని ప్రజలు విశ్వసిం చారని.. కాంగ్రెస్కు చేయి చాపారని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని అన్నారు.
హుజురాబాద్(Hujurabad)లో మాత్రం కౌశిక్ రెడ్డిని ప్రజలు గెలిపించారని, ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని, ప్రజల కోసం పనిచేస్తూ పోవాలని.. 4 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. తన బస్సు యాత్రను కూడా అడ్డుకోవాలని కాంగ్రెస్ బిజెపిలో ప్రయత్నం చేశాయని కానీ తన యాత్రను ఎంత నిషేధిస్తే అంత ప్రజల నుండి ఉవ్వెత్తున స్పందన లభిస్తుందని, దీన్ని ఆ పార్టీలు జీర్ణించుకోలేకపో తున్నాయని అన్నారు. పొట్టొడి నెత్తిని పొడుగోది కొడితే, పొడుగోడి నెత్తిని పోచమ్మ కొట్టిందని.. కెసిఆర్ తన యాత్రను అడ్డుకున్న కాంగ్రెస్ బిజెపిలను ఉద్దేశించి వ్యాఖ్యానిం చారు. ఈ సభకు ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది. పెద్ద ఎత్తున మహిళలు, రైతులు బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు హాజర య్యారు.
BRS form government in Telangana