CITU : క్యూబా ప్రజలకు అండగా ఉందాం
--సిఐటియు CITU : ప్రజాదీవెన నల్గొండ : అమెరికా నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాడుతున్న క్యూబా ప్రజలకు అండగా ఉందామని కార్మిక వర్గ అంతర్జాతీయతను చాటుదామని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి. సలీం జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య పిలుపునిచ్చారు. గురువారం సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నల్గొండ పట్టణంలో క్యూబా సంఘీభావనిది విరాళాల సేకరణ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు క్యూబా ప్రజలు ఉన్న పరిస్థితుల్లో అనేక రూపాల్లో అంతర్జాతీయ సంఘీభావం అవసరం ఎక్కువగా ఉన్నదని అన్నారు. క్యూబన్ విప్లవ...