IT Minister Sridhar Babu : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం తో ‘ఏఐ’ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను ఏర్పాటు చేసేందుకు ఆస్ట్రేలి యాకు చెందిన ప్రముఖ విద్యాసం స్థ ‘డికన్(Deakin) విశ్వవిద్యాల యం’ ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెం ట్(ఎల్ వోఐ)పై సోమవారం డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో ‘డి కన్ యూనివర్సిటీ’ వీసీ ప్రొఫెసర్ ఇయాన్ మార్టిన్, ఐటీ శాఖ డిప్యూ టీ సెక్రటరీ భవేష్ మిశ్రా సంతకాలు చేశారు. అనంతరం ఈ ఒప్పంద ప త్రాలను పరస్పరం మార్పిడి చేసు కున్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ‘అంతర్జాతీయ భాగ స్వామ్యాల ద్వారా ఏఐ రంగంలో తెల గాణను గ్లోబల్ లీడర్ గా తీర్చి దిద్దాలన్నదే మాప్రభుత్వ సంకల్ప మని, ఏఐలో నూతన ఆవిష్కరణ లు, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహిం చాలనే లక్ష్యంతోనే ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఏర్పాటుకు డికన్ యూ నివర్సిటీతో ఒప్పందం చేసుకున్నా మన్నారు. ఇది కేవలం లాంఛనప్రా య ఒప్పందం కాదని, రాబోయే రో జుల్లో కీలక రంగాల్లో తెలంగాణ, ఆ స్ట్రేలియా మధ్య ద్వైపాక్షి సంబంధా ల మెరుగుదలకు దిక్సూచీగా మా రుతుందని ఆకాంక్షించారు. సమా జానికి ఉపయోగపడే అత్యాధునిక ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చే యడంతో పాటు పరిశోధనలు, వ్య వస్థాపకతకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని వివరించారు.
*ఏఐ కోర్సుల రూపకల్పన, శిక్ష ణ, స్టార్టప్ లకు చేయూత*
‘ఏఐ, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ రం గాల్లో ప్రపంచానికి అత్యంత నైపు ణ్యమున్న మానవ వనరులను తె లంగాణ నుంచే అందించాలని ల క్ష్యంగా పెట్టుకుని, ఆ దిశగా చిత్త శుద్ధితో కృషి చేస్తున్నాం. ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్, యంగ్ ఇండియన్ స్కిల్ యూనివర్సిటీ సంయుక్తంగా నేటి మార్కెట్ అవసరాలకు అను గుణంగా ఏఐ కోర్సులకు రూపకల్ప న చేసి, ఇక్కడి యువతకు అంత ర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్ష ణనిస్తాయి. మన ఏఐ స్టార్టప్ సంస్థ లు అంతర్జాతీయ మార్కెట్ లో తె లంగాణ బ్రాండ్ ను మరింత విశ్వ వ్యాప్తం చేసేలా ఆస్ట్రేలియా నిపు ణులు మార్గదర్శకత్వం చేస్తారని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు.
*ఏఐ ఆధారిత పౌర సేవలను అందించేలా… **…‘ఏఐ కేవలం ఒక సాంకేతికత మాత్రమే కాకుం డా, సమ్మిళిత వృద్ధికి, మానవాభి వృద్ధికి ఒక శక్తివంతమైన సాధనం గా మార్చేలా మా ప్రభుత్వం పక డ్బందీ ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తోంది. ఈ లక్ష్య సాధన లో ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ మా ర్గదర్శిగా మారుతుంది. ఆరోగ్య సం రక్షణ, వ్యవసాయం, గవర్నెన్స్ తది తర రంగాల్లో ఏఐ వినియోగాన్ని పెంచి పౌర సేవలను మరింత స మ ర్థవంతంగా అందించేలా సంయుక్త పరిశోధనలు నిర్వహిస్తాం. ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న అనేక స మస్యలకు ఏఐ ఆధారిత పరిష్కా రాలను కనుగొనేందుకు కృషి చేస్తా మని తెలిపారు.
*అందుకే ఇక్కడ ఏర్పాటు చేస్తు న్నాం…* ప్రొఫెసర్ ఇయాన్ మార్టి న్, వీసీ, డికన్ యూనివర్సిటీ
‘ఏఐలో తెలంగాణను గ్లోబల్ లీడర్ గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రశంసనీయం. ప్రజల శ్రేయస్సు కోసం సమర్థవంతమైన, బాధ్యతాయుతమైన ఏఐ పరి ష్కా రాలను అందించాలనే లక్ష్యంతోనే భారత్ లో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయిం చుకున్నాం. ఇందుకోసం తెలంగాణ అన్ని రకాలుగా అనుకూలంగా ఉం దని గుర్తించాం. అందుకే ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ముందుకొ చ్చాం’ డికన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఇయాన్ మార్టిన్ తెలిపా రు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కా న్సూల్ జనరల్(ఆస్ట్రేలియన్ కా న్సూలేట్- జనరల్ బెంగళూరు) స్టీ వెన్, కాన్సూల్ ఆండ్రూ కాలిస్టర్, ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ కమి షనర్ వికా సింగ్, పొలిటిల్ అండ్ ఎకానమిక్ రీసెర్చ్ ఆఫీసర్ రంజని మాధవన్, డికన్ యూనివర్సిటీ ప్రతినిధులు రౌనీత్ పాహ్వా, ప్రి యాంక సింగ్, గాయత్రి వేద్ నా రా యణన్ తదితరులు పాల్గొన్నారు.
