CM Revanth Reddy: ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: తెలంగాణ విద్యారంగంలో సమూల మార్పులు తేవడానికి తాము చేస్తున్నకృషికి మద్దతు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రినిర్మలా సీతారామన్‌కి ము ఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో సుమారు 9 0 శాతంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల్లోని పిల్లలకు కార్పొ రేట్ తరహా విద్యను అందించేందు కు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన కేంద్ర మంత్రికి వి వరించారు.

ముఖ్యమంత్రి ఢిల్లీ నార్త్ బ్లాక్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో సమావే శమయ్యారు. రాష్ట్రంలోని 105 శా సనసభ నియోజకవర్గాల్లో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూ ళ్లను నిర్మించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే నాలుగు పాఠశాలల నిర్మా ణ పనులు మొదలయ్యాయని, మి గతా పాఠశాలలకు సంబంధించి టెండర్లు ముగిశాయన్నారు. ఒక్కో పాఠశాలలో 2,560 మంది విద్యా ర్థులు ఉంటారని, 2.70 లక్షల మం ది విద్యార్థులకు ఈ పాఠశాలల్లో చ దువుకునే అవకాశం లభిస్తుందని ముఖ్యమంత్రి వివరించారు.

అత్యాధునిక వసతులు, ల్యాబ్‌లు, స్టేడియాలతో నిర్మించే ఈ 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసి డెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి రూ. 21 వేల కోట్ల వ్యయమవుతుంద ని వివరించారు. అలాగే రాష్ట్రంలో జూనియర్, డిగ్రీ, సాంకేతిక కళాశా లలు, ఇతర ఉన్నత విద్యా సంస్థ ల్లో ఆధునిక ల్యాబ్‌లు, ఇతర మౌ లిక వసతుల కల్పనకు రూ.9 వేల కోట్లు వెచ్చించనున్నట్లు కేంద్ర మం త్రి కి సీఎం తెలిపారు.
ఈ నిధుల సమీకరణకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు అనుమ తించడంతో పాటు ఎఫ్ఆర్‌బీఎం పరిమితి నుంచి మినహాయించా లని నిర్మలా సీతారామన్‌ని ము ఖ్య మంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభు త్వం విద్యా రంగంపై చేస్తున్న వ్య యాన్ని పెట్టుబడిగా పరిగణించాల ని కోరారు.

గత ప్రభుత్వంలో అధిక వడ్డీలకు అప్పులు తీసుకువచ్చిందని, వాటి చెల్లింపు రాష్ట్ర ప్రభుత్వానికి భారం గా మారిన నేపథ్యంలో వాటి రీస్ట్ర క్చరింగ్‌కు అనుమతించాలని కోరా రు. ముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తు లపై నిర్మలా సీతారామన్ సాను కూలంగా స్పందించారు.
ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మం త్రిని కలిసిన వారిలో ఎంపీలు డా క్టర్ మల్లు రవి, పోరిక బలరాం నా యక్ , సురేశ్ షెట్కార్, చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ప్రభు త్వ ఉన్నతాధికారులు ఉన్నారు.