Praja Deveena
Newspaper Banner
Date of Publish : 28 September 2025, 3:13 pm Posted by : praja deveena

Telanganaendowment : పానగల్ సోమేశ్వరాలయాలను సందర్శించిన పురావస్తుశాఖ సంచాలకులు ప్రొఫెసర్ అర్జునరావు

 

Telanganaendowment: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: తె లంగాణ రాష్ట్ర పురావస్తుశాఖ సంచాల కులుగా నియమితులైన ప్రొఫెసర్ అర్జునరావు కుతాడిని బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన నల్ల గొండ జిల్లాలోని పానగల్ గ్రామంలో ఉన్న రాష్ట్ర రక్షిత కట్టడాలైన పచ్చ ల సోమేశ్వర ఆలయం, ఛాయా సో మేశ్వర దేవా లయం, జిల్లా పురా వస్తు ప్రదర్శనశాలను ఆదివారం సందర్శించా రు.

ఆలయాల స్థితిగతులను పరిశీలిం చిన అనంతరం, వాటి అభివృ ద్ధి కోసం పురావస్తు శాఖ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకు న్నారు. భక్తులకు మరియు పర్యాటకులకు ఆలయాల చరిత్ర తెలి యజేసే వి ధంగా సైన్‌బోర్డులు, వివరణాత్మక బోర్డులు ఏర్పాటు చే యాలని ఆదే శించారు.అదేవిధంగా, ఆలయ గో డలపై ఉన్న వైట్‌ వాష్‌ను వెంటనే ర సాయనిక శుద్ధి (కెమికల్ క్లీనింగ్) చే సి, శిల్ప సంపదను, చరిత్రను భక్తులు, పర్యాటకులు స్పష్టంగా చూ డగలి గేలా చేయాలని ఆదేశించారు.

ఆలయంలో ఉన్న శాసనాల వివరా లను కూడా బోర్డుల రూపంలో ప్రద ర్శించి చరిత్రకారులకు, పర్యాటకులకు అందుబాటులో ఉం చా లని సూచించారు.పర్యాటకులకు ఆలయ చరిత్ర వివరించడానికి ఒక టూ రిస్ట్ గైడ్‌ను కూడా నియమించాలని ఆయన పేర్కొన్నారు. పచ్చల సో మేశ్వర ఆలయం, ఛాయా సోమే శ్వ mర ఆలయంలో సంరక్షణ పను లు చేపట్టాలని ఆయన ఆదేశించారు. సంచాలకులు పురావస్తు శాఖ సిబ్బంది తయారుచేసిన అంచనాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఈ అంచ నాలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి త్వ రలోనే అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు.

జిల్లా పురావస్తు ప్రదర్శనశాలను కూడా ఆయన తనిఖీ చేశారు. ఈ ప్రదర్శనశాల జిల్లాకే తలమానికమై నది. దానిని 40 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు. ఇందులో కొత్తగా అభివృద్ధి చర్యలు చేప ట్టాలని ఆ యన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఉపసంచాలకు లు డాక్టర్ పి. నాగరాజు, ఎన్. న ర్సింగ్ నాయక్, మహాత్మాగాంధీ యూనివర్సిటీకి చెందిన చరిత్రకా రులు డాక్టర్ హమ్మద్ షరీఫ్, డా క్టర్ కిషోర్, పాల్ రెడ్డి వెంకట్ రెడ్డి,గుం డగోని యాదయ్య గౌడ్, కొడి దల ఎల్లయ్య, గుండగోని శ్రీనివాస్ గౌడ్, పురావస్తు ప్రదర్శన శాల సిబ్బంది పాల్గొన్నారు.