Deputy CM Vikramarka : ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు, పంచాయ తీరాజ్ తో పాటు ఆర్ అండ్ బి శా ఖకు సంబంధించిన పెండింగ్ బిల్లు లు అక్టోబర్ మాసానికి సంబంధించి సుమారు 1,031 కోట్ల రూపాయల ను ఒకేసారి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశం మేరకు ఆర్థిక శాఖ అధికారులు విడుదల చేశారు. ఈ మేరకు శుక్రవారం ఉద యం ప్రజాభవన్ లో ఆర్థిక శాఖ అ ధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు.
గత ప్రభుత్వ కాలం నుంచి పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల బకాయిలను దశలవారీగా ప్రతినెలా డిప్యూటీ సీ ఎం భట్టి విక్రమార్క మల్లు క్లియర్ చేస్తూ వస్తున్న క్రమంలో అందులో భాగంగా అక్టోబర్ మాసానికి సంబం ధించి ప్రభుత్వ ఉద్యోగుల బకాయి లు 712 కోట్ల రూపాయలను డి ప్యూటీ సీఎం ఆదేశం మేరకు ఆర్థిక శాఖ అధికారులు విడుదల చేశారు.
అదేవిధంగా 10 లక్షల లోపు పెం డింగ్ లో ఉన్న బిల్లులను క్లియర్ చేయాలని ప్రభుత్వం విధానప ర మైన నిర్ణయం తీసుకుందని వెల్ల డించారు. ఇందులో భాగంగా పం చాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖకు సంబంధించి 46,956 బిల్లుల తా లూకు 320 కోట్ల రూపాయలను డి ప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశం మేరకు విడుదల అధికారు లు చేశారు. రోడ్లు మరియు భవనా ల శాఖకు చెందిన రూ.10 లక్షల లో పు విలువగల 3,610 బిల్లుల మొ త్తం సుమారు రూ.95 కోట్లను ఆర్థిక శాఖ అధికారులు విడుదల చేశా రు.
అదేవిధంగా పంచాయతీరాజ్ మ రియు గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించిన 43,364 బిల్లుల మొత్తం 225 కోట్ల రూపాయలను సైతం విడుదల చేశారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తాని యా తదితరులు పాల్గొన్నారు.