Chevella Bus Accident : ప్రజా దీవెన, చేవెళ్ళ: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో సోమవారం ఉద యం జరిగిన ఘోర ప్రమాదంలో పలువురు ప్రయాణికులు నర క యాతన అనుభవించారు. టిప్పర్ లోని కంకర మొత్తం బస్సులోని ప్ర యాణికులపై పడిన విషయం తెలి సిందే. కంకరలో ఇరుక్కుని బయట కు రాలేక ప్రయాణికులు ఆర్తనాదా లు అరణ్య రోదనలుగా మిగిలా యి. ఈ దృశ్యాలు చూసిన ప్రతి ఒ క్కరినీ కంటతడి పెట్టించాయి.
తోల్కట్టలోని సాంఘిక సంక్షేమ గు రుకుల పాఠశాలలో మ్యాథ్స్ కాం ట్రాక్ట్ టీచర్‌గా పనిచేస్తున్న జయసు ధతో పాటు మరికొందరు నడుము లోతు కంకరలో ఇరుక్కుని బయట కు రాలేకపోయారు. జయసుధకు కాళ్లు వాచిపోవడంతో కుటుంబ స భ్యులు నిమ్స్‌కు తరలించారు. కే రెల్లి గ్రామానికి చెందిన జయసుధ వికారాబాద్‌లో బస్సు ఎక్కారు. ఆ మెతో పాటు మరో నలుగురు ఉ పా ధ్యాయులూ అదే బస్సులో రా వా ల్సింది. ఆలస్యంగా రావడంతో వా రు ఈ బస్సును అందుకోలేక పో యారు. వేరే బస్సులో బయలు దేర డంతో వారంతా ప్రమాదం తప్పిం చుకున్నారు.