CM Revanth Reddy : ప్రజా దీవెన హైదరాబాద్: తెలం గా ణ ప్రభుత్వ అధికారిక గేయ రచ యిత, ప్రముఖ కవి, రచయిత అం దెశ్రీ అంత్యక్రియలు ముగిసాయి. ఈ సందర్భంగా పార్ధీవ దేహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనం గా నివాళులర్పించారు. అందెశ్రీ అం త్యక్రియల్లో సొంత కుటుంబ సభ్యు నిగా మంగళవారం ఘట్ కేసర్ చే రుకున్న సీఎం అందెశ్రీ అంత్యక్రియ లకు హాజరయ్యారు. కన్నీరు ము న్నీరుగా విలపిస్తున్న ఆయన సతీ మణిని, కుటుంబ సభ్యులను సీఎం ఓదార్చారు. అనంతరం అంత్య క్రి య కార్యక్రమాల్లో దగ్గరుండి చూసు కున్న సీఎం అందెశ్రీ పాడెను కూడా ముందుండి మోశారు.
మంగళవారం ఉదయం అందెశ్రీ అంతిమయాత్ర ప్రారంభమైంది. లా లాపేట్ జయశంకర్ స్టేడియం నుం చి తార్నాక, ఉప్పల్ మీదుగా ఘట్కే సర్ వరకు అంతిమయాత్ర కొన సా గింది.
అనంతరం అధికారిక లాంఛనా ల తో ఆయన అంత్యక్రియలు జరిగా యి. అంత్యక్రియల్లో అందరూ రెం డు నిమిషాలు మౌనం పాటించగా పోలీసులు గౌరవ సూచకంగా గా ల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరి పారు. అంత్యక్రియలకు మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, అడ్లూర్ రాక్ష్మణ్, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్ , సీ తక్క, వి.హెచ్, తదితరులు హాజర య్యారు.

