Praja Deveena
Newspaper Banner
Date of Publish : 13 November 2025, 11:52 am Posted by : praja deveena

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య, హైదరాబాద్ నగరం ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారులకు ఉత్తమ గమ్య స్థానo

CM Revanth Reddy : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: అంతర్జా తీ య స్థాయి మౌలిక వసతులు, పరి శ్రమలకు అనువైన వాతావరణం, భద్రతకు ఎటువంటి ఢోకా లేకుండా భౌగోళికంగా కేంద్రస్థానంలో ఉన్న హైదరాబాద్ నగరం ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారులకు ఉత్తమ గమ్య స్థానమని ముఖ్యమం త్రి ఎ. రేవం త్ రెడ్డి పునరుద్ఘాటించారు. దేశం లోనే పెద్ద సంఖ్యలో యువత, వే గ వంతమైన వృద్ధి రేటుతో ఉన్న రా ష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ఢి ల్లీలో జరిగిన యూఎస్ – ఇండియా వ్యూహాత్మక భాగస్వా మ్య సదస్సు (US-India Strate gic Partn er ship Forum (USI SPF)) లో ము ఖ్యమంత్రి ప్రసంగించారు.

తెలంగాణలో గత 35 ఏళ్లుగా కాం గ్రెస్‌తో పాటు అనేక పార్టీలు ప్రభు త్వాలకు సారథ్యం వహించినా, పె ట్టుబడులకు మరియు పెట్టుబడి దారులకు అందరూ మద్దతుగా ని లిచారని ముఖ్యమంత్రి గుర్తుచేశా రు. భారతదేశంలో పెట్టుబడులకు హైదరాబాద్ ప్రధాన ద్వారం అని తె లిపారు. జీసీసీలకు (GCCs) గమ్య స్థానంగా ఉన్న హైదరాబాద్‌లో పె ట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవే త్తలను ఆహ్వానించారు.మహిళా సాధికారిత, నాణ్యమైన విద్య, యువతకు నైపుణ్య శిక్షణ, పట్ట ణా భివృద్ధితో పాటు మెరుగైన వస తు లు, అత్యున్నత జీవన ప్రమా ణాల తో కూడిన అంతర్జాతీయ స్థాయి న గరంగా హైదరాబాద్‌ను తీ ర్చిదిద్ద డమే తన ప్రథమ ప్రాధాన్య తని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

గత 23 నెలల కాలంలో రాష్ట్ర ప్ర భుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షే మ కార్యక్రమాలను వివరించిన ము ఖ్యమంత్రి, అద్భుతమైన మౌలిక వ సతులతో 30 వేల ఎకరాల్లో అంత ర్జాతీయ ప్రమాణాలతో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ భారత్‌లోనే అత్యా ధునిక నగరంగా రూపుదిద్దుకుం టోందని తెలిపారు. మూసీ నది పు నరుజ్జీవనం పూర్తయితే లండన్, టోక్యో, దుబాయ్, సియోల్ రివ ర్‌ ఫ్రంట్‌ల మాదిరిగా హైదరాబాద్ నై ట్ ఎకానమీ కొత్త దశలోకి ప్రవేశి స్తుందన్నారు.డ్రైపోర్ట్, మెట్రో విస్త ర ణ, రీజినల్ రింగ్ రోడ్, రేడియల్ రో డ్లు, ORR R RR మధ్య మాన్యు ఫ్యాక్చరింగ్ జో న్ వంటి కీలక ఇన్‌ ఫ్రా ప్రాజెక్టుల పురోగతిని వివరిం చారు. చైనా ప్లస్ వన్ మోడల్‌కు గ్లోబల్ సమాధానం తెలంగాణ అ వుతుందని ముఖ్య మంత్రి స్పష్టం చేశారు.

హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్, ఆక్స్‌ఫర్డ్ వంటి ఐవీ లీగ్ విశ్వవిద్యాలయాలు హై దరాబాద్‌లో ఆఫ్‌షోర్ క్యాంపస్‌లు ఏర్పాటు చేస్తే, తక్కువ ఖర్చుతో, సులభమైన వీసా విధానాల ద్వారా గ్లోబల్ సౌత్ విద్యార్థులకు నాణ్య మైన విద్య లభిస్తుందని ముఖ్య మంత్రి ప్రపంచస్థాయి విద్యా సం స్థలను ఆహ్వానించారు. భారత దే శంలో రోడ్లకు ఎక్కువగా నేతల పే ర్లు ఉంటాయని, హైదరాబాద్‌లో ఆ ట్రెండ్‌ను మార్చాలని తాము అను కుం మటున్నామని, ముఖ్యమైన రోడ్లకు గూగుల్, మెటా, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి సంస్థల పేర్లను ఇ వ్వాలన్న ఆలోచన ఉందని ముఖ్య మంత్రి తెలిపారు.సదస్సు ప్రారం భంలో తెలంగాణ రైజింగ్ 2047 వి జన్ (Telangana Rising 2047 Vision) ను ప్రదర్శించారు.

తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న ము ఖ్యమంత్రి లక్ష్యానికి, తెలంగాణ రై జింగ్ 2047 విజన్ కు (USISPF) సదస్సులో విశేషస్పందన లభించిం ది. గ్లోబల్ ఇన్వెస్టర్లకు పెట్టుబడుల అవకాశాలు వివరిస్తూ సాగిన ము ఖ్యమంత్రి ప్రసంగం అంతర్జాతీయ వ్యాపార వర్గాలను ఆకట్టుకుంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలం గా ణ విజన్ పారదర్శకంగా, సాహసో పేతంగా, సాధించదగినదిగా ఉంద ని, తెలంగాణ ప్రభుత్వ ప్రణాళిక లు, భవిష్యత్ ప్రాజెక్టులు, వాటి సా మాజిక ప్రభావం ఎంతో ప్రేరణాత్మ కంగా ఉన్నాయని టెక్ దిగ్గజం సి స్కో మాజీ సీఈఓ జాన్ ఛాంబర్స్ ప్రశంసించారు.ముఖ్యమంత్రి ఆ హ్వానం మేరకు USISPF సభ్యు లలో అత్యధికులు డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే తె లంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు ( Telangana Rising Global S ummit) కు హాజరవుతారని, తెలం గాణ విజన్‌ను దగ్గరగా తెలుసు కు నేందుకు ఆసక్తిగా ఉన్నామని USI SPF అధ్యక్షుడు డాక్టర్ ముఖేష్ ఆ ఘీ తెలిపారు.