Praja Deveena
Newspaper Banner
Date of Publish : 14 November 2025, 1:44 pm Posted by : praja deveena

SP Sharath Chandra : నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర కీలక వ్యాఖ్య, నేటి బాలలే దేశ ప్రగతికి మూలాలు 

SP Sharath Chandra : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్:బాలల దినోత్సవం సందర్భంగా పట్టణ కేం ద్రంలోని సెయింట్ అల్ఫోన్సస్ పా ఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్ర మానికి నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ముఖ్యతిధిగా హాజరై చిన్నారులకు బాలల దినోత్సవ శు భాకాంక్షలు తెలియజేసి మాట్లా డు తూ ‘నేటి బాలలే దేశ ప్రగతికి మూ లాలని వ్యాఖ్యానించారు.

అభివృద్ధిలో పరుగులు పెడుతున్న నేటి కంప్యూటర్ యుగంలో పోటీ పడవలసిన వయసులోనే మాద క ద్రవ్యాలకు అలవాటు పడి జీవితా లను నాశనం చేసుకుంటున్నార న్నారు. ఈ మాదకద్రవ్యాలు సే విం చడం ఆరోగ్యంపై ప్రభావితం, సా మాజిక అసమానత, ఆర్థికంగా భ విష్యత్ పై పడే ప్రభావాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తూ పిల్లల కు అవగాహన కల్పించారు.బాల్యం ఎంతో అందమైనదని ఈ పరిస్థితు ల్లో చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, క్రమ శిక్షణ తో చదువుపై దృష్టి సారించాలని తెలుపారు.

తల్లితండ్రులు ప్రతి ఒక్కరు సా మా జిక బాధ్యతగా తమ పిల్లల యొక్క భవిష్యత్తు కార్యాచరణ పై దృష్టి సా రించి వారి యొక్క జీవితాల్లో వెలు గులు పొందే విధంగా చూడాల్సిన బాధ్యత ఎంతైనా అవసరం ఉన్న దని అన్నారు.నల్లగొండ జిల్లా పో లీ స్ శాఖ ఆధ్వర్యంలో మిషన్ పరివ ర్తన్ పేరుతో అనేకమంది మాదకద్ర వ్యాలకు అలవాటు పడిన యువ కులను వారిలో పరివర్తన్ కల్పిం చడం జరిగిందని తెలిపారు.

ఈ బాలల దినోత్సవం సందర్భంగా ప్రాజెక్టు శుద్ధి అనే నూతన కార్యక్ర మం మొదలుపెట్టడం జరిగింది. ఈ ప్రాజెక్టు శుద్ధి కార్యక్రమం ద్వారా బా లల దినోత్సవ రోజు నుండి మా పో లీస్ సిబ్బంది, పాఠశాల, కళాశాల లను సందర్శిస్తూ, విద్యార్థులకు మాదకద్రవ్యాలు సేవించడం వల్ల కలుగు అనర్ధాల పై అవగాహన క ల్పించడం జరుగుతుందని, తద్వా రా సమాజంలో మెరుగైన యువత ను తీర్చిదిద్దే అవకాశం కలుగుతుం దని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నల్గొండ డిఎస్పి కె శివరాం రెడ్డి, ఎస్బి సిఐ రాము,1 టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్సై ల చ్చిరెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ ఉద య్ కుమార్ రెడ్డి, విద్యార్థిని విద్యా ర్థులు పాల్గొన్నారు.

*అత్యాధునిక మొబైల్ AI ఆధా రిత ఎక్స్ రే స్కానింగ్ క్యాంపు ప్రారంభం* పోలీస్ సిబ్బంది విది ని ర్వహణే కాకుండా వారి ఆరోగ్య సం క్షేమం దృష్ట్యా జిల్లా ఎస్పీ ప్రత్యేక చొరవతో పోలీస్ సిబ్బంది, వారి కు టుంబ సభ్యులకు జిల్లా క్షయ నివా రణ కేంద్రం సహకారంతో ఆధునిక ఏఐ టెక్నాలజీతో కూడిన X- రే స్కా నింగ్ మరియు ఇతర వ్యాధుల ఆ రోగ్య శిబిరం ను ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని శుక్రవా రం జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఆరోగ్య కేంద్రం నందు ఎస్పీ ప్రారం భించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ అత్యా ధునిక ఏఐ టెక్నాలజీతో రూపొం దించిన పరికరాలతో ఈ శిబిరం ని ర్వహించడం అభినందనీ యమ న్నారు. ఈరోజు నుండి జిల్లా వ్యా ప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలలో ఈ మొబైల్ శిబిరం నిర్వహించబడు తుందన్నారు.ఈ శిబిరంలో ఛాతి కి సంబంధించిన వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించడం జరుగు తుందన్నారు.

ఈ అవకాశాన్ని పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు సద్విని యోగం చేసుకోగలరని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అడిష నల్ ఎస్పీ రమేష్, ఏ ఆర్ డి.ఎస్పి శ్రీనివాసులు, ఆర్ఐ సంతోష్, డాక్ట ర్ ప్రదీప్,రవి ప్రసాద్, జమాల్, సూ పర్వైజర్ బి. అనిల్ కుమార్, ఎం సైదులు, వెంకటరెడ్డి,సయాదుద్దీన్, ఇనాయత్ అలీ, లెనిన్ పాల్గొన్నా రు.