Praja Deveena
Newspaper Banner
Date of Publish : 17 November 2025, 2:35 pm Posted by : praja deveena

Bhoomi Sunil : భూమి సునీల్ కీలక వ్యాఖ్య, దళా రీ వ్యవస్థ నిర్మూలనతోనే నిజమైన సాగున్యాయం

Bhoomi Sunil : ప్రజా దీవెన, తుంగతుర్తి: వ్యవ సా యం చేసే ప్రతి రైతు సాగు చట్టా ల పై అవగాహన కలిగి ఉండాలని భూచట్టాల నిపుణుడు, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యు డు భూమి సునీల్ అన్నారు. లిప్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేప ట్టిన తెలంగాణ సాగు న్యాయ యా త్ర లో భాగంగా సోమవారం తుంగ తుర్తి మండల కేంద్రంలోని తహసి ల్దార్ కార్యాలయంలో ఏర్పాటుచే సిన కార్యక్రమంలో భూమి సునీల్ పాల్గొని మాట్లాడారు.దళారీ వ్యవ స్థ పూర్తిగా నిర్మూలించబడినప్పుడే నిజమైన సాగు న్యాయం సాధ్యమ వుతుందని తెలిపారు. రైతులు ఎ దుర్కొంటున్న భూ సమస్యలు, నా ణ్యతలేని విత్తనాలు, ఎరువుల మోసాలు, మార్కెట్‌లో అన్యా యం, పంటల బీమా వంటి కీలక అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రపంచంలో పలుదేశాల్లో భూ చ ట్టాలను సమర్థంగా వినియోగిస్తూ రైతులు లబ్ధి పొందుతున్నారని, అ లాంటి అవగాహన మన రైతులకు ఉండాలని సూచించారు. ప్రస్తుతం దేశంలో 200కుపైగా భూ చట్టాలు ఉన్నాయనీ, అవన్నీ రైతులకు ఉప యోగపడేలా అవగాహన కల్పిం చడమే ఈ యాత్ర లక్ష్యమని పేర్కొ న్నారు.

ఈ సమావేశంలో పాల్గొన్న రైతుల కు ప్రతి ఒక్కరు తలా పదిమందికి ఈ విషయాలను తెలియజేయా లన్న పిలుపునిచ్చారు. భూమి ఉం డి పాసుపుస్తకం లేకపోయినా, ఇ తర ఏ భూ సమస్య ఉన్న ప్రభుత్వ నిర్దేశించిన నమూనాలో మీసేవ కేం ద్రాల ద్వారా చేసుకోవచ్చని తెలిపా రు.ఇది దేశంలోనే తొలిసారిగా సా గు చట్టాలపై రైతులలో లోతైన అవ గాహన కల్పించేందుకు చేపట్టిన అధ్యయన యాత్రగా గుర్తించారు. అంతేకాకుండా, వినూత్న పంటల వైపు దృష్టి సారించాలని, అధికంగా ఎరువుల వాడకం వల్ల ప్రజలు అనారోగ్యానికి లోనవుతున్నారని హెచ్చరించారు.

రైతులు పలు సమస్యలను తెరపైకి తెచ్చారు. భూమికి పట్టా ఉన్నప్పటి కీ ఆక్రమణల పాలవడం, రిజిస్ట్రేష న్‌కు మ్యాప్ అవసరమవడం, భూ వివాదాల వంటి అంశాలను ప్రస్తా వించగా ఈ సమస్యలను భూ చ ట్టాల ఆధారంగా పరిష్కరించవ చ్చని వివరించారు.

ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ద యానందం,లిప్స్ సంస్థ ప్రతినిధు లు, అడ్వకేట్లు జీవన్,రవి, అభి లా ష్, సందీప్, దాయం కరుణాకర్ రెడ్డి, కేతిరెడ్డి కరుణాకర్ రెడ్డి,ఏడిఏ రమేష్ బాబు, డిప్యూటీ తహసి ల్దా ర్ యాదగిరి, ఆర్ ఐ లు రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ ఏఈఓ లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.