–అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్ర
మం
–హాజరు కానున్న మంత్రులు, ఎం పీలు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు
–రాష్ట్రంలోనే అత్యధికంగా రూ. 2 6.34 కోట్ల రూపాయల వడ్డీ లేని ఋణాలు నల్గొండ జిల్లాకు కేటా యింపు
–నల్లగొండ జిల్లాలో వడ్డీ లేని రుణా ల పంపిణీ కార్యక్రమాన్ని విజయ వంతం చేస్తాం
–నల్లగొండ జిల్లా కలెక్టర్ జిల్లా త్రిపా ఠి వెల్లడి
District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: రాష్ట్ర ప్రభు త్వం మహిళా సంఘాలకు ఇదివ ర కే రెండు విడతల్లో వడ్డీలేని రుణా లు పంపిణీ చేయగా ,మంగళవారం మరోసారి మూడో విడత పెద్ద ఎ త్తు న వడ్డీ లేని రుణాలను పంపిణీ చే యనుంది. ఇందులో భాగంగా రా ష్ట్రవ్యాప్తంగా 304 కోట్ల రూపాయ ల వడ్డీ లేని రుణాలను స్వయం స హాయక మహిళా సంఘాలకు ఇ వ్వాలని నిర్ణయం తీసుకున్నది.
ఈ విషయంపై రాష్ట్ర ఉపముఖ్య మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భ ట్టి విక్రమార్క సోమవారం హైదరా బాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, డిఆర్డిఓలు, సంబంధిత శాఖల అధి కారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వ హించి ఈ విషయం తెలియజేశా రు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి మా ట్లా డుతూ నల్గొండ జిల్లాలో ఇందిరా మ హిళల శక్తి చీరల పంపిణీ కార్య క్రమంలో భాగంగా నల్గొండ జిల్లాకు మూడు లక్షల 66,000 చీరలు రా గా, 3 లక్షల చీరలను ఇదివరకే పం పిణీ చేయడం జరిగిందని, సోమవా రం రాత్రి వరకు గ్రామస్థాయిలో చీర ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చే స్తామని తెలిపారు.
వడ్డీ లేని రుణాల కింద నల్గొండ జి ల్లాకు రాష్ట్రంలోనే అత్యధికంగా 26.34 కోట్ల రూపాయలు విడుదల చేయడం పట్ల ఆమె ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ని అన్ని నియోజకవర్గాలలో మూడ వ విడత వడ్డీ లేని రుణాలు పంపి ణీ కార్యక్రమాన్ని సవ్యంగా నిర్వ హించేందుకు అన్ని చర్యలు తీసు కుంటామని తెలిపారు.
అంతకుముందు రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క మా ట్లాడుతూ వడ్డీ లేని రుణాలు పంపి ణీ కార్యక్రమాన్ని అన్ని అసెంబ్లీ ని యోజకవర్గాలలో పెద్ద ఎత్తున నిర్వ హించాలని ఆదేశించారు.వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని శాస నసభ్యుల ఆధ్వర్యంలో నిర్వహిం చాలని, ఆయా నియోజకవర్గ కేంద్రం లో మండలాలకు, గ్రామ సమాఖ్యల ఓబిఓలను పిలవా ల ని, వడ్డీ లేని రుణాల నిధులను సో మవారమే విడుదల చేసిన్నట్లు ఆ యన వెల్లడించారు.ఈ కార్యక్రమా నికి ప్రజాప్రతినిధులందరిని ఆహ్వా నించాలని చెప్పారు..
రాష్ట్రంలో మహిళల ఆత్మగౌరవా ని కి ప్రతీకంగా భావించిన ఇందిర మ హిళా శక్తి చీరల పంపిణీ కార్యక్ర మం బాగుందని జిల్లా కలెక్టర్లు ఎ లాంటి ఇబ్బందులు లేకుండా చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుం డడం పట్ల ఆయన అభినందించా రు. చీరల నాణ్యత బాగున్నట్లు త మకు రాష్ట్ర వ్యాప్తంగా సమాచారం వస్తున్నదని తెలిపారు.
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధి శాఖ మంత్రి సీతక్క మాట్లా డుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరా మహిళ శక్తి చీరల పంపిణీ పట్ల మహిళలు సంతోషంగా ఉన్నా రని, వారి కళ్ళలో ఆనందం వ్యక్తం అవుతున్నదని అన్నారు. మహిళ లు ఆర్థికంగా ఎదిగేందుకు వారిని వ్యాపార పరంగా అభివృద్ధి చేయా ల్సి ఉందని, బ్యాంక్ లింకేజీ కింద ఎక్కువ మొత్తంలో రుణాలు, వడ్డీ లేని రుణాలు, చీరల పంపిణీ కొన సాగుతున్నట్లు ఆమె తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు మాట్లాడుతూ రా ష్ట్రప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం, వడ్డీ లే ని రుణాలు ప్రతిష్టాత్మకంగా తీసుకు న్నదని, 3,50,000 మహిళా స్వ యం సహాయక సంఘాలకు మూ డవ విడతన పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. శాసనసభ సభ్యుల సమక్షంలో వీటి ని ఇవ్వాలని తెలిపారు.
సెర్ఫ్ సీఈవో దివ్యదేవరాజన్ మా ట్లాడుతూ వడ్డీ లేని రుణాల పంపి ణీ కార్యక్రమం పకడ్బందీగా నిర్వ హించేందుకు ఆర్డీవోలు, ప్రత్యేకధి కారుల ఆధ్వర్యంలో అసెంబ్లీ ని యోజకవర్గంలో కార్యక్రమాన్ని ని ర్వహించాలని, ఈ కార్యక్రమానికి మండల గ్రామ ఓబి సభ్యులను పిలవాలని, ఈ విషయంపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని, జిల్లా ఇన్చార్జి మంత్రితో పాటు, ప్ర జాప్రతినిధులను భాగస్వామ్యం చే యాలని, ఈ కార్యక్రమానికి వారిని ఆహ్వానించాలని చెప్పారు.
జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షు రాలు మాధవి మాట్లాడారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్ రె డ్డి ,గృహ నిర్మాణ శాఖ పీడి రా జ్ కుమార్, తదితరులు హాజర య్యా రు.
