Praja Deveena
Newspaper Banner
Date of Publish : 24 November 2025, 11:21 am Posted by : praja deveena

District Collector Ila Tripathi : ప్రతిష్టాత్మకంగా స్థానిక సంస్థల ఎ న్నికల పర్యవేక్షణ

— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: స్థానిక సం స్థల ఎన్నికలను మండల ప్రత్యేక అ ధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ప్రజా వాణి కార్య క్రమంలో భాగంగా సోమవారం ఆ మె కలెక్టర్ కార్యాలయంలోని సమా వేశం మందిరంలో ప్రజావాణి కార్య క్రమంలో ( 70) మంది నుండి ఫి ర్యాదులను స్వీకరించారు.

ప్రజా ఫిర్యాదుల స్వీకరణ అనంత రం జిల్లా అధికారులతో వివిధ అం శాలపై జిల్లా కలెక్టర్ సమీక్షిస్తూ జి ల్లా అధికారులందరూ తప్పనిసరిగా ప్రజావాణి కార్యక్రమానికి నిర్దేశించి న సమయంలోగా తప్పనిసరిగా హా జరు కావాలని ఆదేశించారు. ఇకపై అన్ని ప్రభుత్వ కార్యాలయాలను తాను ర్యాండంగా తనిఖీ చేస్తాన న్నారు.

ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధి కారులకు మినహాయింపు ఉండద ని, ఒకవేళ అత్యవసరమైతే ముం దుగానే అనుమతి తీసుకోవాలని చెప్పారు.మండలాల ప్రత్యేక అధి కారులు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రత్యేకంగా తీసుకోవా లని, ఎలాంటి ఇబ్బందులు లేకుం డా పర్యవేక్షణ చేయాలని, అవసర మైతే ఎంపీడీవో కార్యాలయంలో కూర్చొని ఎన్నికలు సవ్యంగా జరిగే లా పర్యవేక్షించాలని ఆదేశించారు.

అలాగే స్థానిక సంస్థల ఇన్చార్జ్ అ దనపు కలెక్టర్, ఆర్డీవోలు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో క్రి యాశీలక పాత్ర పోషించాలన్నారు.

కాగా ఈ సోమవారం మొత్తం (70) ఫిర్యాదులు రాగా,జిల్లా అధికారుల కు(39) రెవెన్యూ శాఖకి(31)వచ్చా యి.

స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, రెవె న్యూ అదనపు కలెక్టర్ జే .శ్రీనివాస్, గృహ నిర్మాణ శాఖ పిడి రాజకు మార్, ఆర్డీవోలు వై.అశోక్ రెడ్డి, ర మణారెడ్డి, శ్రీదేవి, జిల్లా అధికారు లు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్మి కుల బీమా పెంపు పై రూపొందించి న గోడపత్రికను ఆవిష్కరించారు. జిల్లా కార్మిక శాఖ అధికారి, తదిత రులు ఉన్నారు.